కరీనా ఎగ్జైటింగ్ కి కారణం అదా!

Kareena Kapoor revealed to media about her pregnancy

10:55 AM ON 11th June, 2016 By Mirchi Vilas

Kareena Kapoor revealed to media about her pregnancy

చాలామంది బ్యూటీలు కొన్ని అంశాలను ప్రస్తావించగానే ఓ రేంజ్లో విరుచుకుపడడం మనం చూస్తూనే వుంటాం, కానీ బాలీవుడ్ బ్యూటీ కరీనాకపూర్ ఓ విషయంలో హ్యాపీగా ఫీలవుతోంది. ఈమె మాత్రం చాలా ఎగ్జైటింగ్ గా వుందంటూ మనసులోని మాటను బయట పెట్టింది. రీసెంట్గా కరీనాకపూర్-సైఫ్ అలీఖాన్ లు రెస్ట్ కోసం లండన్కు వెళ్ళారు. ఎయిర్పోర్టులో కరీనాను తమ కెమెరాలో బంధించారు ఫోటోగ్రాఫర్లు. ఈ క్రమంలో ఆమె ప్రెగ్నెంట్ అని, అందుకోసమే భర్తతో కలిసి టూర్ వేస్తోందంటూ బాలీవుడ్ మీడియా కోడైకూడింది. ఈ వ్యవహారం ఎలాగోలా చివరకు కరీనా చెవిలోపడింది.

ఈ నేపథ్యంలో ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రెగ్నెంట్ పై క్లారిటీ ఇచ్చేసింది కరీనా. తాను తల్లి కావడం అనేది ఓ వరం.. ప్రజెంట్ అలాంటిదేమీ లేదని, కానీ ఆ మాటలు వింటుంటే చాలా ఎగ్జైటింగ్గా ఉందంటూ తెలిపింది. మొత్తం మీద కరీనా ఈ ఇష్యూకు ఆదిలోనే బ్రేక్ వేసిందని హార్డ్కోర్ ఫ్యాన్స్ అంటున్నారు. ఓపెన్ గా మాట్లాడేస్తే, ఇక ఎలాంటి రూమర్లకు ఆస్కారం ఉండదని అభిమానులు తెగ మెచ్చుకుంటున్నారు.

English summary

Kareena Kapoor revealed to media about her pregnancy