అదే జరిగితే చచ్చిపోతానన్న కరీనా!

Kareena Kapoor shocking comments about Katrina Kaif

12:15 PM ON 29th September, 2016 By Mirchi Vilas

Kareena Kapoor shocking comments about Katrina Kaif

కలవడం విడిపోవడం బాలీవుడ్ కి కొత్తేమీ కాదు. అయితే బాలీవుడ్ ప్రేమ పక్షలు రణబీర్ కపూర్, కత్రినా కైఫ్ లు విడిపోయి దాదాపు పది నెలలు కావొస్తోంది. ఇద్దరి మధ్య ఏం జరిగిందన్న విషయం మాత్రం ఇద్దరూ బహిర్గతంగా చెప్పలేదు. ఇద్దరి మధ్య మాటల్లేకపోయినా వీరిద్దరి గురించి ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. అయితే వీరిద్దరి మధ్య ఏం జరిగిందో రణబీర్ సోదరి కరీనా కపూర్ కి కూడా తెలీదట. తాజాగా కరీనా వోగ్ బీఎఫ్ఎఫ్ చాట్ లో ఈ విషయాన్ని చెప్పింది. ఒకవేళ మీరు కత్రినా, రణబీర్ తో కలిసి లిఫ్ట్ లో వెళ్తూ ఇరుక్కుపోతే ఏం చేస్తారు అని అడిగితే, 'అదే జరిగితే నా ప్రాణం నేనే తీసుకుంటా' అని తడుముకోకుండా చెప్పింది కరీనా.

రణబీర్, కత్రినాలు రిలేషన్ షిప్ లోఉన్నప్పుడు కరీనా, కత్రినాలు బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండేవారు. కరణ్ జోహార్ టీవీ షో 'కాఫీ విత్ కరణ్' కి కరీనా, రణబీర్ లు వచ్చినప్పుడు కత్రినాని నా మరదలు అని సంబోధిస్తూ రణబీర్ ని ఏడిపించిందట. ఇప్పుడు మనుషులు ఎవరి దారి వారు చూసుకోవడంతో ఇద్దరి మధ్య అంత మాటలు కూడా లేవని కరీనా అంటోంది.

English summary

Kareena Kapoor shocking comments about Katrina Kaif