చీర కట్టులోనే మజా అంటున్న కరీనా

Kareena Kapoor talks about saree

05:44 PM ON 30th April, 2016 By Mirchi Vilas

Kareena Kapoor talks about saree

బాలీవుడ్‌ అందాల తార కరీనాకపూర్‌ శనివారం హైదరాబాద్‌ మహా నగరంలో సందడి చేసింది. మెహిదీపట్నంలోని ఓ నగల దుకాణం ప్రారంభోత్సవానికి వచ్చిన కరీనాను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంతమంతా అభిమానుల కేరింతలతో కోలాహల వాతావరణం నెలకొంది. అనంతరం దుకాణంలోని నగలను ప్రదర్శిస్తూ.. అభిమానులతో సెల్ఫీలు దిగుతూ సందడి చేసింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరీనా మాట్లాడుతూ.. సంప్రదాయ చీరకట్టు అంటే తనకెంతో ఇష్టమని తెలిపింది.

1/7 Pages

English summary

Kareena Kapoor talks about saree. Kareena Kapoor came to Hyderabad yesterday for shop opening.