వేధింపు కేసు పెట్టిన కరిష్మా

Karishma Kapoor Filed Harassment Case

03:54 PM ON 27th February, 2016 By Mirchi Vilas

Karishma Kapoor Filed Harassment Case

బాలీవుడ్‌ నటి కరిష్మాకపూర్‌ తన భర్త సంజయ్‌కపూర్‌, ఆయన కుటుంబసభ్యులపై వేధింపుల కేసు పెట్టింది. దీంతో సంజయ్‌కపూర్‌ అతని కుటుంబసభ్యుల పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి సెక్షన్‌ 498ఏ, 34 కింద కేసు నమోదు చేశారు. గత కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోయిన నేపధ్యంలో తాజాగా కరిష్మా తన భర్త తరపు కుటుంబం తనని వేధింపులకు గురి చేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం వీరిద్దరూ పెట్టుకున్న విడాకుల కేసు బాంద్రా ఫ్యామిలీ కోర్టులో ఉంది. కాగా కరిష్మాకు కుటుంబబాధ్యతలు నిర్వర్తించడం తెలియదని, డబ్బు కోసమే తనని పెళ్లి చేసుకుందని సంజయ్‌ ఆరోపిస్తున్నాడు. తన పిల్లలను అడ్డం పెట్టుకొని డబ్బు కావాలని డిమాండ్ చేస్తోందని అంటున్నాడు. ఇక ఈ కేసు మార్చి 3న విచారణకు రాబోతోంది. ఇక సంజయ్‌ తరపు న్యాయవాది ఈ కేసును డిల్లీ సుప్రీంకోర్టుకి అప్పగించాలని పిటిషన్‌ను పెట్టుకున్నారు. కోర్టుకెక్కిన ఈ వ్యవహారం ఇలా వుండగా వేధింపు కేసు నమోదైంది.

English summary

Bollywood Veteran Heroine Karisma Kapoor files Dowry Harassment Case on her Husband Sanjay Kapoor and on his family Members.Police had filed FIR on this issue.