రెండో పెళ్లికి సిద్ధమైన మాజీ హీరోయిన్

Karishma Kapoor ready for second marriage

04:47 PM ON 2nd July, 2016 By Mirchi Vilas

Karishma Kapoor ready for second marriage

ఒకప్పుడు హీరోయిన్ గా బాలీవుడ్ ని తన అందాలతో ఏలిన కరిష్మా కపూర్, కపూర్ ల ఫ్యామిలీ లో టాప్ హీరోయిన్ గా నిలిచింది. మాధురి దీక్షిత్ హవా కొనసాగుతున్న సమయంలోనే ఆమెకు పోటీగా నిలబడ్డ ఈ గ్లామర్ భామ దశాబ్ధం పైగానే బాలీవుడ్ ని ఏలింది. ఆ తరువాత అవకాశాలు తగ్గడంతో ఓ బిజినెస్ మెన్ ని పెళ్లి చేసుకుంది కరిష్మా.. అయితే అతగాడి ప్రవర్తనతో రోజు గొడవలు జరగడంతో కొన్ని రోజులకు భర్త నుండి విడిపోయింది. విడాకులు తీసుకున్న కొన్ని రోజులకే ఆమె భర్త మరో యంగ్ హీరోయిన్ తో అఫైర్ మొదలు పెట్టాడు. మరో వైపు కరిష్మా కూడా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది.

దాంతో పాటు రెండో పెళ్లికి కూడా సిద్ధమైంది.. ప్రస్తుతం కరిష్మా తండ్రి వరుడి వేటలో ఉన్నాడట. త్వరలోనే కరిష్మా నటించే సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఓ రెండు చిత్రాల్లో నటించి ఆ తరువాత పెళ్లి చేసుకుని ఆ తరువాత మళ్ళీ సినిమాల్లో కంటిన్యూ అవ్వాలని ఫిక్స్ అయింది. ఇక పెళ్లి కొడుకు దొరకడమే ఆలస్యం.. కరిష్మా పెళ్లి అయిపోతుందనే మాట.

English summary

Karishma Kapoor ready for second marriage