మహిమ గల కర్మన్ ఘాట్ ఆంజనేయస్వామి గురించి తెలుసుకోండి

Karmanghat Hanuman Temple In Hyderabad

01:02 PM ON 22nd December, 2016 By Mirchi Vilas

Karmanghat Hanuman Temple In Hyderabad

రామనామ జపంతో తరిచి చిరంజీవి అయిన శ్రీఆంజనేయస్వామి భక్తులపాలిట పెన్నిధి. ఎక్కడైనా రామనామ జపం , కీర్తనలు జరుగుతుంటే అక్కడ ఆంజనేయుడు ఉంటాడని చెబుతుంటుంటారు. అంతేకాదు, నిత్యం రామ ధ్యానంలో వుండే ఆయనను స్మరిస్తే అన్ని రకాల భూత,ప్రేత,పిశాచ భయాలను పోగొడతాడు. చాలాచోట్ల హనుమాన్ మందిరాలున్నాయి. ఇక ధ్యానముద్రలో స్వయంభువుగా వెలిసిన శ్రీ ఆంజనేయస్వామి అవతరించిన ఆలయం ఒకటి వుంది. అదే హైదరాబాద్ లోని కర్మన్ ఘాట్ లోని ఆంజనేయ స్వామి టెంపుల్. వందల ఏళ్ల నుంచి భక్తులను దీవిస్తూ ధ్యానముద్రలో వున్న అంజనాసుతుని దర్శనాన్ని చేసుకుంటే అన్ని రకాలుగా మంచి ఫలితాలు లభిస్తాయని అంటారు. ముఖ్యంగా సంతానం లేనివారు స్వామిని దర్శించి నిండుమనస్సుతో ప్రార్థిస్తే సంతానం కలుగుతుందని పెద్దలు చెబుతారు. ఈ ఆలయం వెనుక చాలా చరిత్ర మహిమ వున్నాయి.

1/9 Pages

క్రీ.శ. 1148లో కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించే రెండో ప్రతాపరుద్రుడు వేటాడుతూ అలసి ఇక్కడ ఒక రాయిపై విశ్రమిస్తాడు. కాసేపటికి అతనికి పులి గాండ్రింపు శబ్దాలు వినిపించడంతో అప్రమత్తుడై విల్లంబులు ధరించి అక్కడకు వెళుతాడు. అక్కడ ఏమి కనిపించకపోవడంతో తిరిగి రాయి వద్దకు వస్తాడు. మళ్లీ పులి గాండ్రింపు వినరావడంతో తిరిగి గాలిస్తాడు.

English summary

Famous and powerful Hanuman Temple located at Karman ghat, closer to Sagar Ring Road In Hyderabad.