ఆ ‘వాచీ’ ని వదులుకున్న కర్ణాటక సిఎమ్

Karnataka Chief Minister Handovers His Watch To Assembly Speaker

10:16 AM ON 3rd March, 2016 By Mirchi Vilas

Karnataka Chief Minister Handovers His Watch To Assembly Speaker

అధికారంలో వున్నవాళ్ళు చేసే ప్రతి పని మీదా విపక్షాలు కన్నేసి ఉంచుతాయి. అది చిన్నదైనా , పెద్దదైనా ఏ అంశాన్ని వదిలి పెట్టకుండా జాగ్రత్తగా గమనిస్తాయి. ఇప్పుడు కర్నాటక సిఎమ్ అలా విపక్షాల పరిశోధనలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వివాదాస్పదంగా మారిన ఈ అంశం భారీ కుంభకోణం కాదు ...సిఎమ్ ధరించిన వాచీ. అయితే అది మామూలు వాచీ కాదు. అక్షరాలా 70 లక్షలట. అందుకే ఆ వాచీ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ను చిక్కుల్లో పడేసింది. దీంతో డైమండ్ హాబ్లెట్‌ చేతి వాచీని వదులుకున్నారు. ఈ వాచీ గురించి రేగిన దుమారం అసెంబ్లీ కి తాకింది.

ఇప్పటికే ఈ వాచీ గురించి సిఎమ్ వివరణ ఇస్తూ, తన చిన్ననాటి మిత్రుడు బహుమానంగా ఇచ్చాడని చెప్పినా, వివాదం చల్లారలేదు. సభకు ఈ అంశం చేరడంతో బుధవారం నాటకీయ శైలిలో విధానసభలో సభాపతి కాగోడు తిమ్మప్పకు ఈ వాచీని సమర్పించడం ద్వారా వివాదానికి సిఎమ్ తెరదించే ప్రయత్నం చేసారు. అయితే ఆయన చర్యలను విపక్ష నేతలు తీవ్రంగా ఆక్షేపించారు. సభా కార్యకలాపాలు మొదలైన వెంటనే విపక్షాలు ధర్నాను ప్రారంభించాయి. విలువైన గడియారానికి సంబంధించిన వాయిదా తీర్మానం పై చర్చించేందుకు అనుమతివ్వాలని సభ్యులు డిమాండ్‌ చేశారు. పాలక, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరుకోవడంతో సభాపతి తిమ్మప్ప సభను కొద్దిసేపు వాయిదా వేశారు. సాయంత్రం మూడున్నర గంటలకు సభ తిరిగి ఆరంభమైన వెంటనే నాటకీయంగా సిద్ధరామయ్య హాబ్లెట్‌ గడియారాన్ని సభాపతికి సమర్పించారు. దాన్ని మంత్రివర్గ సమావేశ మందిరంలో పదిలం చేయాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి స్పీకర్‌ అందించారు. దీనిపై విపక్షాలు సంతృప్తి చెందకుండా, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని దర్యాప్తు సంస్థచే విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. మరి ఈ వాచీ ఘటన ఇంకా ఎలాంటి పరిణామాలకు దారితీయనుందో ...

కర్ణాటక సీఎం వాచీ వివాదం ఏంటో తెలుసుకోండి....

English summary