గడియారం గుట్టు విప్పారండోయ్..

Karnataka Chief Minister Siddaramaiah watch Controversy

05:46 PM ON 26th February, 2016 By Mirchi Vilas

Karnataka Chief Minister Siddaramaiah watch Controversy

తన పై అసత్య ఆరోపణలు చేసిన జేడీఎస్‌ అధ్యక్షుడు కుమారస్వామిపై ఎలాంటి చర్య తీసుకోవాలో న్యాయవాదులతో చర్చించి నిర్ణయిస్తానని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. అయితే కుమారస్వామి కుటుంబసభ్యుల విలాసవంతమైన జీవితాలు, వారు వినియోగిస్తున్న కార్లు, గడియారాల వివరాలు వెల్లడించాలని తాను డిమాండ్‌ చేయబోనని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తనకున్న ఖరీదైన గడియారం ధరించి వివాదంలో చిక్కుకున్న సిద్దరామయ్య ఎట్టకేలకు దాని గుట్టు విప్పారు. 'దుబాయిలో ఉండే చిరకాల స్నేహితుడు డాక్టర్‌ గోపాల్‌ పిళ్లె గిరిష్‌చంద్ర వర్మ గత ఏడాది జులైలో నగరానికి వచ్చినపుడు ఆయన చేతికి ఉన్న ఖరీదైన చేతి గడియారాన్ని వద్దంటున్నా నాకు కానుకగా ఇచ్చారు. దాని విలువ అప్పట్లో తెలియదు. ఇప్పుడు తెలిసినందున ప్రభుత్వానికి కానుక పన్ను చెల్లిస్తున్నా' సిద్ధరామయ్య వెల్లడించారు. ఆ గడియారాన్ని విధానసౌధలోని మంత్రివర్గ సమావేశం గదిలో ఉంచుతానని తెలిపారు. ప్రతిపక్షాలతో పాటు స్వపక్షం నుంచి విమర్శలు రావడంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. కేరళకు చెందిన డాక్టర్‌ గిరిష్‌ చంద్రవర్మతో 1983 నుంచి స్నేహం ఉందని, దావణగెరెలో ఆయన వైద్య విద్యాభ్యాసం చేశారని, నగరానికి వచ్చినప్పుడు కలిసి గడియారాన్ని ఇచ్చారని సిద్దరామయ్య తెలియజేశారు. అందుకు సంబంధించిన పత్రాలు త్వరలో ఆయన తీసుకొచ్చి బహిరంగపరుస్తారని, ఇక ఆస్తుల వివరాలను లోకాయుక్తకు సమర్పించే సమయంలో గడియారం విషయం ప్రస్తావిస్తానని సిద్ధరామయ్య స్పష్టం చేసారు. ఇంతకీ ఇది నిజమా , కట్టు కదా అనే సందేహాలూ వ్యక్తం అవుతున్నా , ప్రస్తుతానికి ఈ వివాదం నుంచి సిద్ధ రామయ్య ఎస్కేప్ అయినట్లే !

English summary

Karnataka Chief Minister Siddaramaiah has being spotted with a luxury watch allegedly worth Rs. 70 lakh.He says that one of his friend has gifted him that luxury watch.He also says that he will hand it over to the government to preserve it as a state asset. He will also pay gift tax on the watch.