మాజీ ఎం ఎల్ ఏ అక్రమ సంబంధం ... నిలదీసిన భార్యను ఏం చేసాడో తెలుసా?

Karnataka Ex MLA Wife Protest On Her Husband

10:55 AM ON 21st December, 2016 By Mirchi Vilas

Karnataka Ex MLA Wife Protest On Her Husband

ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు వున్నాయి అంటూ ఓ సినీ కవి ఎప్పుడో రాసాడు. అందుకే నాయకులున్నాక ఏ పార్టీ వారైనా సరే ఒకేలా వ్యవహరిస్తున్నారు. అకృత్యాలు, అత్యాచారాలు , అక్రమ సంబంధాలు , మాఫీయాలు ఎలా అన్నింటా ఒకరికి మించి మరొకరు అన్నచందంగా యవ్వారం నడుస్తోంది. కర్ణాటకలో నిన్న గాక మొన్న బంధువుల తాలూకు మహిళపై అత్యాచారం చేసిన ఘటనకు ఆ రాష్ట్ర మంత్రి ఒకరు రాజీనామా చేసిన సంగతి తెల్సిందే. ఈ వ్యవహారం ఇంకా సమసిపోక ముందే బిజెపి నేత అయిన మాజీ ఏం ఎల్ ఏ అక్రమ సంబంధం తెరమీదికి వచ్చింది. అయితే భర్త అక్రమ సంబంధం గురించి ప్రశ్నించిందనే కోపంతో భార్యను కొట్టిన ఆ బీజేపీ మాజీ ఎమ్మల్యే బాగోతం తాజాగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే,

కర్ణాటక రాష్ట్రంలోని ముదిగెరె అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు కుమారస్వామిని అతని భార్య సవిత అక్రమసంబంధం గురించి ప్రశ్నించిందనే ఆగ్రహంతో ఆమెపై చేయి చేసుకున్నాడు. నీటిపారుదల శాఖలో ఇంజినీరుగా పనిచేస్తున్న సవిత మాజీ ఎమ్మెల్యే కుమారస్వామిని పెళ్లాడారు. వారి కుటుంబం హెచ్ఎస్ఆర్ లేఅవుట్ లోని ఓ ఇంట్లో నివాసముంటున్నారు. భర్త కొట్టినందుకు భార్య సవిత నిరసనగా భర్త ఇంటి ముందే ధర్నాకు దిగారు. అక్రమ సంబంధాలు పెట్టుకోవడం తన బలహీనత అని ఈ విషయంలో తనను ప్రశ్నించవద్దని భార్యను కుమారస్వామి ఆదేశించాడట. అయినా భార్య సవిత భర్తను నిలదీయడంతో ఆమెను కొట్టి ఇంటినుంచి బయటకు నెట్టి... ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లిపోయాడు. కాగా తన భార్య సవిత తనకున్న 30 ఎకరాల కాఫీ తోటను తన పేరిట పెట్టాలని తనను బ్లాక్ మెయిలింగ్ చేస్తుందని కుమారస్వామి ఆరోపించారు. కాఫీ తోట ఇవ్వనన్నందుకు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ అప్రతిష్టపాలు చేస్తుందని కుమారస్వామి పేర్కొన్నారు. బీజేపీ ప్రతిష్ట మంటగలిసేలా కుటుంబవ్యవహారంలో ప్రవర్తించవద్దని కుమారస్వామికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప హితవు పలికారు. కాగా మాజీ ఎమ్మెల్యే కుటుంబ వ్యవహారంపై తాము ఎలాంటి కేసు నమోదు చేయలేదని బెంగళూరు పోలీసులు చెప్పారు. మొత్తం మీద మాజీ ఎమ్మెల్యే భార్యతో రాజుకున్న వివాదం చర్చనీయాంశం అయ్యింది. ఇక ఈ ఘటనపై నెటిజన్లు మండిపడుతున్నారు. యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: దారుణం:15వ అంతస్తు నుంచి 5 ఏళ్ల బాలికను విసిరేసింది

ఇవి కూడా చదవండి: ఫేస్ బుక్ ప్రియులకు ఇక పండగే

English summary

Karnataka Ex BJP MLA Kumara Swamy was beat his wife severely and his wife made protest infront of his house and this new made sensation in Karnataka Politics.