బంధువైన మహిళా ఉద్యోగినిపై లైంగిక దాడి - మంత్రి రాజీనామా

Karnataka Excise Minister HY Meti Resign

10:44 AM ON 15th December, 2016 By Mirchi Vilas

Karnataka Excise Minister HY Meti Resign

అత్యంత నాటకీయ పరిణామాల మధ్య కర్ణాటక ఎక్సైజ్ (అబ్కారి) శాఖ మంత్రి హెచ్ .వై.మేటి లైంగిక దౌర్జన్య ఆరోపణపై బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. వెంటనే దానిని అంగీకరించాలని కోరుతూ గవర్నర్ వాజూభాయి వాలాకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పంపించారు. ఈ రాజీనామాను ఆమోదించినట్లు రాజభవన వర్గాలు బుధవారం సాయంత్రం ప్రకటించాయి. ఈ ఆరోపణల్లో నిజాల నిగ్గు దేల్చేందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సీఐడీ విచారణకు ఆదేశించారు.

లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక ఎక్సైజ్ శాఖ మంత్రి హెచ్ .వై.మేటి చివరికి పదవిని వదులుకోవాల్సి న ఘటన వివరాల్లోకి వెళ్తే, మంత్రి హెచ్ .వై.మేటి బంధువైన ప్రభుత్వ ఉద్యోగిని ఒకరు నవంబరులో బెంగళూరు కార్యాలయంలో మంత్రిని కలసి తనకు అనువైన స్థలానికి బదిలీ చేయించాలని కోరారు. ఈ క్రమంలోనే ‘లైంగిక దౌర్జన్యం’ చేశారనేది ఆరోపణ. మంత్రి మేటి భద్రత సిబ్బందిలో ఒకరు ఈ అరాచకాన్ని మొబైల్ తో వీడియో తీశారు. ఆ సీడీ బుధవారం దృశ్య మాధ్యమాల్లో ప్రసారమైంది. మరో పక్క తొలుత ఈ వ్యవహారాన్ని ఖండించిన సంబంధిత బాధితురాలు మంగళవారం మాట మార్చి, మంత్రి మేటి తనపై లైంగిక దౌర్జాన్యానికి పాల్పడ్డారని ఆరోపించారు.

గతంలో ఆయన అనూయాయులు చంపుతామని బెదిరించినందున భయపడి నిజం చెప్పలేదని ఆమె వివరించారు. అనారోగ్యంగా ఉన్నానంటూ బాగలకోట ప్రభుత్వ వైద్యాలయంలో చేరగా, వైద్యులు మాత్రం ఆమె ఆరోగ్యంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బుధవారం మంత్రి మేటి రాజీనామా చేయడంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. మంత్రి యవ్వారంపై సీడీ బుధవారం దృశ్యమాధ్యమాల్లో ప్రసారమైంది. వెనువెంటనే ఆ మంత్రి ‘నైతిక బాధ్యత’ వహిస్తూ పదవికి రాజీనామా చేయగా దానిని ఆమోదించారు. కర్ణాటకలో బుధవారం దృశ్య మాధ్యమాల్లో వచ్చిన ఈ వీడియో దృశ్యాలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. దీనిపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ నిర్దోషినని మంత్రి మేటి అంటున్నప్పటికీ మాధ్యమాల్లో వెలువడిన ఆరోపణలకు స్పందించి చర్యలు చేపట్టామన్నారు.

ఇది కూడా చూడండి: న్యూమరాలజీ ప్రకారం మీ పేరు ఏం చెబుతోంది?

ఇది కూడా చూడండి: ఈ ఈ రాసుల వాళ్ళు వివాహం చేసుకోకూడదట

ఇది కూడా చూడండి: హైట్ పెరగాలంటే ఈ ఫుడ్స్ తినాల్సిందే

English summary

Karnataka excise minister HY Meti submitted his resignation to Chief Minister Siddaramaiah on Wednesday.