కమల్ ని మించిపోయిన కార్తీ.. 'కాష్మోరా'లో కార్తీ ఎన్ని గెటప్ లు వేశాడో తెలుసా?

Karthi 47 getups in Kashmora movie

03:00 PM ON 31st August, 2016 By Mirchi Vilas

Karthi 47 getups in Kashmora movie

ఒకే సినిమాలో 4 పాత్రలు అప్పట్లో లోక నాయకుడు కమల్ హాసన్ వేసే వారు. ఆ తరువాత 'దశావతారం'లో ఏకంగా పది గెటప్స్ లో కనిపించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. కమల్ బాటలోనే చియాన్ విక్రమ్ కూడా పయనించారు. అయితే తమిళ నటుడు కార్తీ ఇప్పుడు ఆ రికార్డులు అన్నింటినీ బద్దలు కొడుతూ ఏకంగా రికార్డు స్ధాయి గెటప్స్ లో కనిపించబోతున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే.. కార్తీ కాష్మోరా సినిమా కోసం ఏకంగా 47 గెటప్స్ లో కనిపించబోతున్నాడట. గెటప్ అంటే జస్ట్ డ్రెస్ మార్చేయడం కాదు.. లుక్ కూడా వేరుగా ఉంటుందట. ఈ సినిమాలో ఇన్ని గెటప్పులు వేయాల్సిన అవసరం ఏమొచ్చిందో.. ఆ స్క్రిప్టు అంతగా ఏం డిమాండ్ చేసిందో చెప్పలేదు కానీ.. తాను ఈ సినిమా కోసం 47 గెటప్పులేసిన విషయం మాత్రం వాస్తవం అని చెప్పాడు కార్తీ.

తన కెరీర్ లో ఏ సినిమాకూ లేనంతగా కష్టపడాల్సి వచ్చిందని.. నెలల తరబడి కష్టపడి అలసిపోయానన్నాడు. ఆ కష్టానికి సరైన ఫలితమే దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. సినిమాకు అవసరం కాబట్టే ఇంత కష్టపడ్డానన్నాడు. ఈ మధ్యే రిలీజైన కాష్మోరా ఫస్ట్ లుక్ అటు తమిళంలో.. ఇటు తెలుగులో చర్చనీయాంశంగా మారింది. ఈ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతున్నట్లు కూడా తెలుగు సినీ ప్రేక్షకులకు తెలియదు కానీ.. కార్తీ ఫస్ట్ లుక్ చూశాక మాత్రం ఆశ్చర్యపోతూ ఈ సినిమా గురించి చర్చించుకున్నారు. కపాల మాంత్రికుడి తరహాలో ఉన్న కార్తి గెటప్ సినిమా మీద ఆసక్తి రేకెత్తించింది. పీవీపీ సినిమా రూ.60 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తుండటం విశేషం. అక్టోబరు నెలాఖర్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇది కూడా చదవండి: 'జనతా' చూసి ఎన్టీఆర్ కి ఫోన్ చేసిన చిరు!

ఇది కూడా చదవండి: ప్రపంచం మొత్తంలో ఒక్క ఇండియాలోనే 8 రకాల న్యూఇయర్స్ చేసుకుంటాం.. అవేంటో తెలుసా?

ఇది కూడా చదవండి: యాపిల్ కంపెనీకు దిమ్మ తిరిగే షాక్!

English summary

Karthi 47 getups in Kashmora movie. Tamil actor Karthi 47 getups in Kashmora movie.