ఆ కధ తెల్సి కూడా 'కార్తీ ' ధైర్యం చేయలేదా ?

Karthi About Saala Khadoos Movie

05:50 PM ON 3rd February, 2016 By Mirchi Vilas

Karthi About Saala Khadoos Movie

ఓ సినిమా హిట్ అయిందంటే , దాని వెనుక కష్టం మాట దేవుడెరుగు, వేరే వేరే కామెంట్ల సందడి నెలకొంటుంది. ఈ కధ మాకే ముందు తెల్సని , చేయడానికి కుదరలేదని చెబుతూ వుంటారు. తాజాగా జనవరి 29న విడుదలైన ఈ చిత్రం తమిళం, హిందీ భాషల్లో మంచి వసూళ్లను రాబడుతున్న 'సాలాఖడూస్‌ ' చిత్రం గురించి, సరిగ్గా ఇదే టాక్ నడుస్తోంది. ఆర్‌.మాధవన్‌, రితికా సింగ్‌లు ప్రధాన ప్రాతధారులుగా క్రీడానేపథ్యంతో తెరకెక్కిన 'సాలాఖడూస్‌' తమిళంలో ‘ఇరుది సుట్రు’ చిత్ర కథ తొలుత తనకే చెప్పారని నటుడు కార్తీ అంటున్నాడు. దర్శకురాలు సుధ కొంగర మూడు సంవత్సరాల క్రితమే ఈ కథ చెప్పి అభిప్రాయం తెలియజేయాలని అడిగినట్లు కార్తీ తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్ చేసాడు . ఆ సమయంలో కథ ముగింపునకు సంబంధించి కొన్ని సూచనలు చేశానని కూడా అంటున్నాడు. అయితే ఈ స్క్రిప్ట్‌ను, దర్శకురాలిని నమ్మి ఇంత అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కించినందుకు నటుడు మాధవన్‌ ను కార్తీ అభినందించాడు. దర్శకురాలు సుధకొంగరను తాను అక్కయ్య అని పిలుస్తానని.. ఇంత అద్భుతమైన కథను తెరపై ఆవిష్కరించనందుకు ఆమెకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రియల్‌ లైఫ్‌ బాక్సర్‌, నటి రితికా సింగ్‌ తన పాత్రలో చక్కగా ఒదిగిపోయారని కితాబిచ్చేసాడు. మరి కధ తెల్సి కూడా చేసే ధైర్యం చేయలేక పోయానని కార్తీ ఒప్పుకున్నట్టేగా .... అందుకే ధైర్యే లక్ష్మి అన్నారు పెద్దలు .

English summary

Recently R.Madhavan's New Film Saala Khadoos Movie was released and it became a super hit at box office.This film film weas released in Both Tamil and Hindi. This movie was based on Boxing Game.Tamil Hero Karthi Says That this story was first came to him and he was rejected to do such experiment films.Karthi also congratulated Saala Khadoos Movie Team in his Facebook Account