కలిసి నటించబోతున్న 'బ్రదర్స్'

Karthi and Surya is acting in Singham 3 movie

12:56 PM ON 18th May, 2016 By Mirchi Vilas

Karthi and Surya is acting in Singham 3 movie

తమిళంలో స్టార్ హీరో అయిన సూర్యకి తెలుగులో కూడా అంతే క్రేజ్ ఉంది. తాజాగా సూర్య తమ్ముడు కార్తీ కూడా 'ఊపిరి' చిత్రంతో తెలుగులో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి ఒకే సినిమాలో కనిపించబోతున్నారన్న వార్త ఇప్పుడు చెన్నైలో హల్ చల్ చేస్తుంది. ఇటివలే '24' చిత్రంతో సూర్య, 'ఊపిరి' చిత్రంతో కార్తీ థియేటర్స్ లో హంగామా చేసిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు ఈ ఇద్దరి కలయికలో రానున్న సినిమా పై భారీ అంచనాలే నెలకొన్నాయి. అసలు విషయంలోకి వెళ్తే హరి దర్శకత్వంలో సూర్య తాజాగా 'సింగం -3' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ చిత్రంలో శృతి హాసన్, అనుష్క హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో సూర్యతో పాటు కార్తీ కూడా నటిస్తున్నాడట. ఈ సినిమాలోని ఒక పాత్రను కార్తీతో చేయించాలని ఈ చిత్ర దర్శకుడు హరి ఆశ పడ్డాడట. ఆ విషయాన్ని సూర్య, కార్తీకి చెప్పగానే వెంటనే బ్రదర్స్ ఇద్దరూ ఓకే చెప్పెశారట. అయితే ఈ చిత్రంలో కార్తీ రోల్ పూర్తి స్థాయిలో ఉండదట. కేవలం ఒక రెండు సన్నివేశాలతో పాటు ఒక పాటలో సూర్యతో కార్తీ కనిపిస్తాడని చెన్నై సమాచారం. మొత్తానికి వీరిద్దరూ కలిసి నటిస్తున్నారంటే అటు తమిళంతో పాటు ఇటు తెలుగులో కూడా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

English summary

Karthi and Surya is acting in Singham 3 movie. Tamil star hero Surya latest movie Singham 3. In this movie Surya younger brother Karthi is playing a small role.