తుది దశకు చేరుకున్న కాష్మోరా

Karthi Kashmora Shooting In Final Stage

01:25 PM ON 8th January, 2016 By Mirchi Vilas

Karthi Kashmora Shooting In Final Stage

డైనమిక్‌ హీరో కార్తీ, అందాల నటి నయనతార కలిసి నటిస్తున్న అప్‌కమింగ్‌ మూవీ కాష్మోరా. ఈ సినిమా రెండు దశల షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న తరువాత పెద్ద బ్రేక్‌ తీసుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా చివరి దశ షూటింగ్‌ను పూర్తి చేయబోతున్నారు అని సమాచారం. ఈ చివరి దశ షూటింగ్‌ జనవరి 9న ప్రారంభం కానుంది. ఇప్పుటికే 50 శాతం పూర్తయిన ఈ సినిమా చివరి దశ షూటింగ్‌ను త్వరగా పూర్తి చెయ్యడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి గోకుల్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో శ్రీదివ్య ఒక లీడ్‌రోల్‌ లో కనిపించన్నుంది. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఈ సినిమాని ఈ సంవత్సరంలోనే రిలీజ్‌ చేయ్యాలనుకుంటున్నారని సమాచారం.

English summary

Kollywood hero karthi's upcoming movie Kashmora movie shooting was in final stage.This movie is to be released in this year