'కాష్మోరా'లో షాకింగ్ లుక్ తో కార్తీ!

Karthi shocking look in Kashmora

02:30 PM ON 18th August, 2016 By Mirchi Vilas

Karthi shocking look in Kashmora

యుగానికి ఒక్కడు, ఆవారా, నా పేరు శివ వంటి చిత్రాలతో తెలుగులో తనకంటూ మార్కెట్ ని క్రియేట్ చేసుకున్న తమిళ హీరో కార్తీ. ఇటీవలే అక్కినేని నాగార్జున నటించిన ఊపిరి చిత్రంలో నటించి ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. ఇందులో కార్తీ నటనకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. తాజాగా కాష్మోరా సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. దీపావళి కానుకగా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, కొద్దిసేపటి క్రితం కార్తీ స్వయంగా విడుదల చేశారు. ఇక ఈ ఫస్ట్ లుక్ లో కార్తీని చూసిన వారంతా అతడి మేక్ ఓవర్ కు ఫిదా అయిపోయారు.

పూర్తిగా గుండు కొట్టించుకొని, ఓ యుద్ధ నేపథ్యంలో నడిచే కథలో సైనికాధికారిలా కనిపిస్తూ కార్తీ అందరినీ ఆశ్చర్యపరిచారు. పీవీపీ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో కార్తీ సరసన నయనతార, శ్రీ దివ్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాష్మోరా ఫస్ట్ లుక్ ఇలా విడుదలైందో లేదో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ వస్తోంది. కార్తీ చేసిన ప్రయత్నానికి అభిమానుల దగ్గర్నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ఒకసారి ఆ లుక్ పై మీరు ఒక లుక్ వెయ్యండి.

English summary

Karthi shocking look in Kashmora