కార్తీక మాసం విశిష్టత... ఈసారి మరిన్ని ప్రత్యేకతలు..

Karthika masam specificity

11:15 AM ON 31st October, 2016 By Mirchi Vilas

Karthika masam specificity

మిగిలిన మాసాలకు కార్తికానికి చాలా తేడా వుంది. ఎందుకంటే, ఒక పండుగ ముగిసిన వెంటనే మరొక పండుగ వస్తోంది.. అది ఒక రోజు పండుగ కాదు.. నెల రోజుల పండుగ.. అదే కార్తీక పండుగ. కార్తీక మాసం సోమవారం నుంచి ప్రారంభమయింది. ఈ పండుగలో ఈ సారి చాలా ప్రత్యేకతలున్నాయి. కార్తీక మాసం ప్రారంభం కావడమే సోమవారం ప్రారంభమవుతుంది. అందునా కార్తీక సోమవారం, కార్తీక పౌర్ణమి కలిసి రావటం ప్రత్యేకత.. మరొక ప్రత్యేక ఏమిటంటే ఈ ఏడాది కార్తీకమాసంలో 5 సోమవారాలు వచ్చాయి. కార్తీక మాసం అక్టోబర్ 31 నుంచి నవంబర్ నెల 30 తేదీ వరకు ఉంటుంది.. అటువంటి ఆధ్యాత్మిక పండగ నెలలో వచ్చే వాటి గురించి తెలుసుకుందాం... ఆచరిద్దాం.. పండుగను ఆనందంగా చేసుకుంటాం..

1/8 Pages

1న సోదరి ఇంట భోజనం చేయాలి..


కార్తీక మాసంలో మొదటిగా వచ్చేది యమ విదియ.. దీనినే భగినీ హస్త భోజనం.. అన్నా చెల్లెళ్ల పండుగ అని కూడా అంటారు.ఈ పండుగ నవంబరు 1వ తేదీన వస్తోంది. యమధర్మరాజు సోదరి యమనా దేవి ఒక రోజు అలక చెందగా ఆయన ఆమెకు ఒక వరం ఇస్తారు. యమ విదియ రోజున ఎవరు తన సోదరి ఇంట భోజనం చేస్తారో వారికి నరక భాదలు ఉండవని చెబుతారు.అందుకే ఈ రోజున సోదరి ఇంట భోజనం చేసి ఆశీర్వచనాలు అందిస్తారు. ఈ సాంప్రదాయం ఇప్పటికీ చాలా ఇళ్లల్లో కొనసాగుతోంది.

English summary

Karthika masam specificity