ఇంటి పోరు కరుణను ముంచేసింది ?

Karunanidhi Sons Celebrates His fathers defeat

04:14 PM ON 20th May, 2016 By Mirchi Vilas

Karunanidhi Sons Celebrates His fathers defeat

కంటి లన నలుసు...చెప్పులోని రాయి...చెవిలో జోరీగ...ఇంటిపోరు ఇంతింత కాదయా అన్నారు కదా ... సరిగ్గా తమిళనాడులో అదే జరిగింది... వారసత్వ రాజకీయ పోరు కరుణా నిధి పాలిట శాపమైంది. డిఎంకె పుట్టి మునిగింది. ఫలితంగా ఒక్క శాతం ఓట్లతో అధికారం దూరమైపోయింది. అప్పుడెప్పుడో 1980లలో భవిష్యత్ లో ఇంటి పోరు ఉండకూడదని వారసులు రాజకీయ వారసత్వం కోసం తన్నుకోకూడదని తమిళనాడు రాజకీయ కురువృద్దుడు - డీఎంకె అధినేత కరుణానిధి తన పెద్ద కుమారుడు అళగిరిని చెన్నై నుండి మధురైకి సాగనంపాడు. అక్కడే ఉండి రాజకీయాలు చూసుకోవాలని పార్టీ పత్రిక మురసోలిని నడపాలని చెప్పి పంపించాడు.

ఇవి కూడా చదవండి:బ్రహ్మోత్సవం మూవీ రివ్యూ అండ్ రేటింగ్

తండ్రి ఆదేశాల ప్రకారం అళగిరి మధురై వెళ్లి రాజకీయంగా నిలదొక్కుకున్నాడు. మధురై పరిసరాలు తన కనుసన్నలలో మెదిలేలా పట్టు పెంచుకోవడమే కాకుండా .. చుట్టు పక్కల జిల్లాలలో కూడా తన ప్రభావం పెంచుకున్నాడు. కాలక్రమేణా చిన్న కొడుకు స్టాలిన్ ఎదిగివచ్చాడు. అళగిరి తండ్రి స్థానాన్ని ఆశించినా, కరుణానిధి మాత్రం చిన్న కుమారుడు స్టాలిన్ నే రాజకీయ వారసుడిగా ప్రకటించాడు. ఎదిరించిన అళగిరిని పార్టీ నుండి బహిష్కరించాడు.

తండ్రి చేతిలో అవమానంతో తల్లడిల్లిన అళగిరి తాజా ఎన్నికల్లో తండ్రిని - తమ్ముడిని కోలుకోలేని దెబ్బకొట్టాడు. డిఎంకెకు ఓటేయనని ప్రకటించిన అళగిరి తన అనుచరులను కూడా అన్నాడీఎంకెకు ఓటేయాలని చెప్పాడట. అళగిరికి పట్టున్న మధురైలో 10 స్థానాలకు ఎనిమిది అన్నాడీఎంకె గెలవడం దీనికి బలం చేకూరుస్తోంది. అంతే కాదు మధురై - తిరునెల్వేలి - తేని - దిండిగల్ - విరుద్ నగర్ జిల్లాల్లో మొత్తం 56 స్థానాల్లో అన్నాడీఎంకే విజయం సాధించింది. తండ్రి ఓటమితో అళగిరి సంబరాల్లో మునిగి తేలుతున్నాడట. పాపం 13సార్లు శాసన సభకు గెలిచినా, కొడుకుల మధ్య సయోధ్య కుదర్చలేకపోయాడు.

ఇవి కూడా చదవండి:సెక్స్ లో అలా చేసి ప్రాణాలు కోల్పోయిన లేడి డాక్టర్

ఇవి కూడా చదవండి:చిరంజీవితో లేడీ ఎంఎల్ఎ రొమాన్స్

English summary

DMK party Chief Karunanidhi's first son Alagiri celebrated his father Karunanidhi's Defeat in Tamilndau Elections. Karunanidhi's first son was Alagiri and he was suspended from DMK party by Karunanidhi.