మాటలు నేర్చిన నెరజాణ

Katrina About Her Relation With Ranbeer

10:10 AM ON 3rd February, 2016 By Mirchi Vilas

Katrina About Her Relation With Ranbeer

మొత్తానికి రణబీర్ కపూర్ తో కటీఫ్ అయినట్లా కాదా అనే విషయాన్ని బహిర్గతం చేయకుండా, ఎదురు ప్రశ్నలతో అందరికీ షాకులిస్తోంది కత్రినా... అసలు తన బలం , బలహీనత ఏమిటో కత్రినా కైఫ్‌కి బానే అర్థమైనట్టుంది అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఏ ప్రశ్నకు ఎలాంటి సమాధానం ఎలా చెప్పాలో కూడా ఫుల్ గా తర్ఫీదు పొందినట్లుంది. ‘చాలా మంది తారలు మహిళా నేపథ్య సినిమాలు చేస్తూ రాణిస్తుంటే, మీరేంటి వాటిపై మొగ్గుచూపడం లేదు?’ ఈమధ్య ఓ విలేకరి, అడిగాడట. దానికి ఆమె ఇచ్చిన సమాధానం ఇలా వుంది. ‘అలాంటి సినిమాలలో రాణించదగిన ప్రతిభ నాకు లేదు. అంతటి అనుభవం కూడా లేదు’ అని చెప్పేయడంతో అంటా నిర్ఘాంత పోయారట. ‘మీ నటన మీద కన్నా వ్యక్తిగత జీవితంపై ఎక్కువ వార్తలు వస్తున్నాయేంటి?’ అని మరో విలేకరి అడిగితే ‘విజయం వెంట వదంతి నీడలా ఉంటుంది . నేను అలాంటి వార్తలను పెద్దగా పట్టించుకోను’ అంటూ దిమ్మ తిరిగేలా చెప్పేసిందట. ‘బాయ్‌ ఫ్రెండ్‌ రణబీర్‌ కపూర్‌తో స్నేహసంబంధాలు బెడిసికొడుతున్నట్లు వార్తలు వస్తున్న ఈ తరుణంలో ‘జగ్గా జాసూస్‌’ సినిమాలో అతడి సరసన ఎలా నటించగలుగుతున్నారు?’అన్న ప్రశ్నకు కత్రినా తొణక కుండా బదులిస్తూ, ‘అసలు మా మధ్య విభేదాలు వున్నాయని ఎవరు చెప్పారు?’ అంటూ ఎదురు దాడి తరహాలో ప్రశ్నించేసరికి, అంతా ఆవాక్కయ్యారట. పోనీ అంతటితో ఆగితే పర్వాలేదు. ‘‘అయినా మీరంతా నా వ్యక్తిగత విషయాలకు ఇచ్చే ప్రాధాన్యతను నా నటనకు ఎందుకివ్వరు?’ అని కత్రినా అడిగేసరికి, అబ్బో , తెలివిమీరిందే' అంటూ గుసగుసలు వినిపించాయి. మొత్తానికి మాటలు బానే నేర్చింది కత్రినా.

English summary

Recently in an press meet Bollywood Glamorous heroine Katrina Kaif was asked questions about her relationship with hero Ranbeer Kapoor and Katrina replied that why the people were keeping more focus on her personal life rather than her acting and acting skills.