కొరియోగ్రాఫర్‌ని తిట్టిన కత్రినా!!

Katrina Kaif angry on dance master

06:50 PM ON 26th November, 2015 By Mirchi Vilas

Katrina Kaif angry on dance master

స్వతహాగా ఎప్పుడూ కూల్‌గా ఉండే బాలీవుడ్‌ బ్యూటీ కత్రినా కైఫ్‌ ఇటీవల ఒక విషయంలో డ్యాన్స్ మాస్టర్ పై ఆగ్రహం కట్టెలు తెంచుకుందట. ప్రస్తుతం కత్రినా ఇప్పుడు సిద్ధార్ధ్‌ మల్వోత్రాకి జంటగా 'బార్‌బార్‌ ధేఖో' అనే చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రంలో ఒక పాటకి భాస్కో అనే డ్యాన్స్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారట. ఆ పాటలో హీరోహీరోయిన్స్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు. ఆ పాటకి భాస్కో సమకూర్చిన డ్యాన్స్‌ మూమెంట్స్‌ కత్రినాకి నచ్చలేదంట, దానితో పాటు వేరే చిన్న పొరపాటు కూడా చెయ్యడంతో కత్రినా భాస్కో పై విరుచుకుపడిందని సమాచారం.

పెద్ద పెద్ద అరుపులు, కేకలు వెయ్యడంతో కత్రినాని కూల్‌ చెయ్యడానికి బాస్కో ఎంత ప్రయత్నించినా ఆమె చల్లారలేదట. సెట్ లో అందరూ ఒక్కసారిగా నిశబ్ధం అయిపోయారట. ఎప్పుడూ కూల్‌గా ఉండే కత్రినా ఒక్కసారిగా ఎందుకు ఇంత ఆగ్రహంగా ప్రవర్తించిందో కత్రినాకి సన్నిహితంగా ఉండేవాళ్లు అనుకుంటున్నారట. ఇంతకీ కత్రినాకి ఎందుకు ఇంత కోపం వచ్చిందో ఆరాతీస్తే అసలు విషయం తెలిసింది. తాజాగా కత్రినా ప్రియుడు రణబీర్‌ కపూర్‌ దీపికా పదుకొనే కలిసి నటించిన 'తమాషా' చిత్రం లో సాంగ్‌కి బాస్కోనే స్టెప్స్‌ కంపోజ్‌ చేశాడట, అవి మరీ హాట్‌గా ఉండడంతో రణబీర్‌ని ఏమీ అనలేక బాస్కో పై ఇలా విరుచుకుపడింది. బాస్కో హర్ట్‌ అయిన సంగతి గ్రహించిన కత్రినా ఏదో సరదాకి అన్నట్లు నవ్వుతూ కప్పి పుచ్చుకుందట.

English summary

Katrina Kaif angry on dance master Baasco in Baar Baar Dekho movie set