సల్మాన్‌ పై కత్రినా షాకింగ్ కామెంట్స్

Katrina Kaif Response On Salman Khans Olympic Controversy

11:07 AM ON 3rd May, 2016 By Mirchi Vilas

Katrina Kaif Response On Salman Khans Olympic Controversy

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ పై సినీనటి, ఆయన మాజీ ప్రియురాలు కత్రినాకైఫ్‌ సంచలన వ్యాఖ్యలు చేసింది. బ్రెజిల్‌లోని రియో డి జెనిరియాలో జరిగే ఒలింపిక్స్‌కు భారత్‌ జట్టుకు గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా సల్మాన్‌ ఎంపిక అంశంపై తీవ్ర దుమారం చెలరేగిన నేపధ్యంలో షాకింగ్ కామెంట్స్ చేసింది. తన కొత్త చిత్రం ‘బార్‌ బార్‌ దేఖో’ షూటింగ్‌ సందర్భంగా పలువురు మీడియా ప్రతినిధులు ఈ వివాదం పై స్పందించాలని కోరడంతో కత్రినా స్పందిస్తూ,‘‘బజరంగీ భాయ్‌జాన్‌’ హీరోకు వివాదాలేమి కొత్త కాదు’ అంటూ ఘాటుగా సమాధానమిచ్చింది. సల్మాన్‌ఖాన్‌ ఎంపికను ప్రముఖ బాలీవుడ్‌ నటి, బిజెపి ఎంపీ హేమమాలిని సమర్థిస్తుండగా, 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం విజేత యోగేశ్వర్‌ దత్‌, మిల్కాసింగ్‌ వంటివారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సల్మాన్‌కు క్రీడల్లో పాత్ర ఏమైనా ఉందా? ఆయనను రియో ఒలింపిక్స్‌ గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా ఎంపిక చేయడంలో ఆంతర్యమేంటని వారు ప్రశ్నిస్తున్నారు.దేశ ప్రజల్ని పిచ్చివాళ్లను చేయడం ఆపండంటూ యోగేశ్వర్‌దత్‌ ట్విట్టర్‌లో తన అసంతృప్తిని తెలియజేశారు.

ఇవి కూడా చదవండి: చనిపోయిన ప్రతీ మనిషి ఆత్మ ముందు ఆ గుడికే వెళ్తుందట!

ఇవి కూడా చదవండి: యశోదా ఆసుపత్రికి 47 లక్షల ఫైన్

English summary

Salman Khan was selected as Brand Ambassador For India for Rio Olympics which was going to be done in Brazil. Few of the celebrities and Players were Opposed for selecting Salman Khan . Recently Salman's Ex- Girl Friend Katrina Kaif responded on this issue and said that Salman Khan was not new to Controversies.