ఆ పనికి కత్రినా 6 కోట్లు తీసుకుందట

Katrina Kaif takes 6 crores for Belly dance

12:50 PM ON 19th April, 2016 By Mirchi Vilas

Katrina Kaif takes 6 crores for Belly dance

బాలీవుడ్ హాట్ బ్యూటీ కత్రినాకైఫ్ రేంజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో గత ఐదు సంవత్సరాలుగా మొదటి మూడు స్థానాల్లో కత్రినా ఉంటుంది. ఈ హాట్ బ్యూటీ తాజాగా నటించిన ఫిటూర్ చిత్రం మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కత్రినా జగ్గ జసూస్, బార్ బార్ దేఖో చిత్రాల్లో నటిస్తుంది. కత్రినా ఒక్క సినిమాకు 7 నుంచి 9 కోట్లు పారితోషికం తీసుకుంటుంది. అయితే తాజాగా కత్రినా కేవలం పది నిమిషాల డాన్స్ పెర్ఫార్మన్స్ కే 6 కోట్లు తీసుకుందట. ఇటీవల ఐపీఎల్‌ ప్రారంభోత్సవం రోజున కత్రినా కైఫ్ చేసిన బెల్లీ డాన్స్ ప్రేక్షకులకు వేడి పుట్టించింది.

అయితే ఈ ప‌ది నిమిషాల స్టేజ్ పర్‌ఫార్మెన్స్ కి కత్రినా తీసుకున్న పారితోషికం అక్షరాలా ఆరు కోట్ల రూపాయలని సమాచారం. కేవ‌లం పది నిముషాల షో ఇచ్చి ఇంత ఎక్కువ పారితోషికం తీసుకున్న హీరోయిన్ గా కత్రినా కొత్త రికార్డు సృష్టించింది.

English summary

Katrina Kaif takes 6 crores for Belly dance. Bollywood hot beauty Katrina Kaif gave a live performance in IPL 2016 ceremony. For this 10 minutes belly dance performance Katrina takes 6 crores remmuneration.