ఆ విషయం చెప్పని కత్రీనా...

Katrina Says She Was Single

11:49 AM ON 1st February, 2016 By Mirchi Vilas

Katrina Says She Was Single

ఇటీవల వస్తున్న వార్తలు , ఊహాగానాలపై ఎట్టకేలకు కత్రినా కైఫ్ స్పందించింది. అది కూడా ఫితూర్‌ ప్రమోషన్స్‌లో... కత్రినా, ఆదిత్య రాయ్‌ కపూర్‌లు నటించిన ఫితూర్‌ ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యంలో కత్రినా నోరువిప్పింది. ‘నా వ్యక్తిగతవిషయాల గురించి ప్రస్తావించనప్పుడు ప్రజలు ఏవేవో వూహించేసుకుంటారు. నా గురించి రోజూ ఏదో ఒక విషయం వార్తల్లో వస్తూనే ఉంది. అలాంటివి చదివే బదులు బ్రేకింగ్‌ న్యూస్‌ లాంటివి ఎందుకు చదవరు. నేను ప్రపంచ అగ్ర కథానాయికల్లో ఐదో స్థానంలో ఉన్నాను. ఇదే విషయం స్టోరీగా వార్తల్లో రావాలనుకుంటున్నాను. నాకు తెలిసింది ఒక్కటే. పెళ్లి కానంతవరకు అందరూ సింగిలే. మరి నాకు పెళ్లే కాదు నిశ్చితార్థం కూడా కాలేదు. అందుచేత నేనూ సింగిలే’ అని చక చకా చెప్పేసింది. బాలీవుడ్‌లో కత్రినా, రణ్‌బీర్‌ల విషయం ఎంత చర్చనీయాంశంగా మారిన నేపధ్యంలో చిత్ర ప్రచార కార్యక్రమాల్లోనూ మీడియా, అభిమానులు సినిమా విషయాలకన్నా రణ్‌బీర్‌ విషయాలే ఎక్కువగా అడగడం ద్వారా కత్రినాను ఇబ్బంది పెట్టేస్తున్నారు. అయితే నేను సింగిలే అంటూ ఎన్నో చెప్పిన కత్రినా ఇంతకీ తాను రణ్‌బీర్‌తో బ్రేకప్‌ అయిందా లేదా అన్న విషయం మాత్రం బహిర్గతం చేయలేదు. మరి దీనర్ధం మళ్ళీ కలుసుకుంటారా ....

English summary

Bollywood number one heroine Katrina Kaif says that she was single till she was married or engaged with some one. She says that her latest movie "Fitoor" was going to be released on February 12th.