కత్రినా సంతకం వుంటే చాలు 

Katrina Signature On Loreal Brands

11:42 AM ON 1st February, 2016 By Mirchi Vilas

Katrina Signature On Loreal Brands

ప్రేక్షకులను మత్తెకించే బాలీవుడ్‌ నటి కత్రినా కైఫ్‌ సంతకానికి ఇప్పుడు భలే గిరాకీ ఏర్పడింది. ఇదేదో ఆషామాషీ వ్యవహారం కాదండోయ్. నిజంగా లోరియల్‌ బ్రాండ్‌ సంస్థ తన ఉత్పత్తులకు కత్రినా సంతకం జోడించింది. కత్రినా సంతకంతో కూడిన లోరియల్‌ బ్రాండ్‌ లిప్‌స్టిక్‌, నెయిల్‌ పాలిష్‌లను మార్కెట్‌లోకి విడుదల చేశారు.‘లావియన్‌ రోజ్‌’ కలెక్షన్‌ పేరుతో ఇవి మార్కెట్లో అందుబాటులో దొరుకుతాయి. ఇలా తన సంతకంతో సౌందర్య ఉత్పత్తులు రావడంపై ఆమె ఆనందానికి అవద్దులేవని అంటున్నారు. పింక్ కలర్ లో ఉన్న లిప్‌స్టిక్‌లు, నెయిల్‌పాలిష్‌లు తనకెంతో ఇష్టమని కత్రినా చెబుతోంది. మరి ఇప్పుడు పింక్ కలర్ ఉత్పత్తులను తన సంతకంతో విడుదల చేయడం ఆమెకు గర్వంగా వుంటుంది కదా . ...ఇక ఈ కొత్త కలెక్షన్‌లో కత్రినాతోపాటు ఐశ్వర్యారాయ్‌, సోనమ్‌కపూర్‌, హాలీవుడ్‌ నాయికలు జూలియాన్నేమూర్‌, ఎవా లాంగోరియాల సంతకాలతో కూడా ఈ ఉత్పత్తుల్ని లోరియల్‌ సంస్థ విడుదల చేసింది. భవిష్యత్తులో ఇలాంటి ఉత్పత్తులు ఇంకా ఎలాంటి కొత్త పుంతలు తోక్కుతాయో ...

English summary

Bollywood Number One heroine Katrina Kaif presently was the brand ambassador for Loreal paris brands like lips sticks,nail polish etc.Now Loreal company was printing Katrina Kaif's signature on its brands