నింద్రలోంచి లేవగానే నగ్నంగా పోలింగ్ బూతుకొచ్చి..?(వీడియో)

Katy Perry Funny or Die video

03:27 PM ON 30th September, 2016 By Mirchi Vilas

Katy Perry Funny or Die video

ఈ ఏడాది నవంబర్ 8 మంగళవారం జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నిక ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. ప్రతి నాలుగేళ్లకోసారి అమెరికన్ ఓటర్లు తమ దేశ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియలో పాల్గొంటారు.. అగ్రరాజ్యమైన అమెరికాలో జరిగే రాజకీయ ప్రక్రియ మిగిలిన దేశాలన్నింటినీ ప్రభావితం చేస్తుంది. ఒకవైపు డెమోక్రటిక్ పార్టీ తరపున మొదటిసారి ఒక మహిళా అభ్యర్థి, హిల్లరీ క్లింటన్ శ్వేత సౌధంలోకి ప్రథమ పౌరురాలిగా అడుగిడటానికి ప్రయత్నిస్తుండగా, మరొకవైపు కరుడుగట్టిన మితవాదభావాలు గల డొనాల్డ్ ట్రంప్(రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి) హిల్లరీ ప్రత్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటేయడానికి ప్రజలు ముందుకు రావాలంటూ ప్రముఖ గాయని కేటీ పెర్రీ వినూత్న ప్రచారం చేసింది.

నిద్ర నుంచి లేవగానే అలాగే నేరుగా పోలింగ్ బూత్ కు వచ్చి ఓట్లు వేయాలని చెబుతూ అందుకోసం ఒక ప్రచార వీడియో రూపొందించింది. అందరినీ ఎలా కావాలంటే అలా వచ్చి ఓటేయమని చెబుతూ తాను ఉన్నట్టుండి పూర్తి నగ్నంగా మారిపోతుంది. అదిచూసి అప్పుడే బూత్ లో ఓటు వేయడానికి వెళ్తున్న ఓ వ్యక్తి కింద పడిపోతాడు. క్యూలో ఉన్నవాళ్లు కూడా ఆశ్చర్యంగా చూస్తుంటారు. అంతలో ఇద్దరు పోలీసులు వచ్చి పెర్రీని తీసుకెళ్లి పోలీసు కారులో కూర్చోబెట్టేస్తారు. దీన్నంతటినీ కలిపి 'ఫన్నీ ఆర్ డై' అనే పేరుతో ఒక వీడియో రూపొందించింది. దుస్తుల్లోనే వచ్చి ఓటు వేయాలని ఎక్కడా లేదని ఆమె వెల్లడించింది. అందువల్ల ప్రజాస్వామ్యంలో మన ఇష్టం వచ్చినట్లు పక్కమీద నుంచి లేచి అలాగే వచ్చి ఓటు వేయొచ్చని అంటోంది. ఇందుకోసం ఆమె రకరకాల దుస్తులు చూసిందట. అయితే, చివరకు బర్త్ డే సూట్ అయితేనే బాగుంటుందని భావించిందట. ఎవరి గోల వారిది అంటే ఇదేనేమో.

English summary

Katy Perry Funny or Die video