'గౌతమీపుత్ర’ 200రోజుల సినిమా అన్న కెసిఆర్

KCR At Balakrishna 100th Movie Launch event

11:21 AM ON 22nd April, 2016 By Mirchi Vilas

KCR At Balakrishna 100th Movie Launch event

మొత్తానికి బాలయ్య వందో సినిమాకు ముహూర్తం అయింది. చీఫ్ గెస్ట్ గా వచ్చిన తెలంగాణా సిఎమ్ కెసిఆర్ తెగ పొగిడేశారు. మెగా స్టార్ చిరంజీవి కూడా హాజరయ్యాడు. 'గౌతమీపుత్ర శాతకర్ణి’ లో బాలయ్య నటించడం ఆయన నటనకే హైలైట్ అవుతుందన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. శాతకర్ణి ఒక శకానికి నాందిపలికిన వాడని, అలాంటి స్టోరీని సినిమాగా తీయడం చెప్పుకోదగిన విషయమన్నారు. తెలుగు ప్రజల గుండెల్లో చిరుకాలం నిలిచిపోయేలాంటి కథ వస్తువును తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించడం గొప్ప విశేషమని ప్రశంసించారు. ఈ సినిమా 200 రోజులు ఆడుతుందని, అన్ని తరాల తెలుగు ప్రజలంతా చూసి తీరాల్సిన మూవీగా అభివర్ణించారు. ఒకనాడు మద్రాసీయులుగా పిలవబడుతున్న తెలుగు వారిని సమైక్యపరిచి వారి ఖ్యాతిని చాటిన ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణకు ఇది వందో మూవీ కావడం మరింత ప్రాముఖ్యత సంతరించుకుందన్నారు. తెలుగు ప్రజలకు- నందమూరి కుటుంబానికి మధ్య వున్న అనుబంధం గొప్పదని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి: శాతకర్ణి అపూర్వ చిత్రంగా నిలుస్తుందన్న చిరు

ఇవి కూడా చదవండి:రణ్‌వీర్‌సింగ్‌,వాణీకపూర్‌ ముద్దులే ముద్దులు

1/4 Pages

కెసిఆర్ స్పందన 

బాలకృష్ణ 100వ సినిమాకు ప్రారంబోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతున్న తెలంగాణా ముఖ్య మంత్రి కెసిఆర్.

English summary

Bala Krishna's 100th film launching event was started today morning and Telangana Chief Minister KCR attended as Chief guest and said that This movie will Defenately run for 200 days Sucessfully in Theaters.