శ్రీజ ప్రతిభకు కేసీఆర్ మురిసిపోతూ... రూ.10లక్షలు ఇచ్చారు

KCR Blessed Talented Srija And Gifted 10 Lakhs

10:49 AM ON 12th April, 2016 By Mirchi Vilas

KCR Blessed Talented Srija And Gifted 10 Lakhs

ప్రతిభ ఉన్న వారిని ప్రోత్సహించటమే కాదు.. వారు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేసేలా చేయటం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అలవాటు. ఆయన వైఖరి ఎంత ప్రాక్టికల్ గా ఉంటుందో.. అంతే నాటకీయంగా కొన్ని సందర్భాల్లో వ్యవహరిస్తుంటారు. నిజానికి ఈ రెండు భిన్న కోణాలు అయినప్పటికీ..ఈ రెండింటిని అవసరానికి తగినట్లుగా తెర మీదకు తీసుకురావటం కేసీఆర్ కు మాత్రమే చెల్లుతుంది. మిగిలిన ముఖ్యమంత్రులకు భిన్నంగా ఆయన కొన్నిసార్లు నాటకీయ రీతిలో వ్యవహరిస్తుంటారు. తాజాగా ఆయన ప్రదర్శించిన చతురత పరిశీలిద్దాం..

ఇవి కూడా చదవండి:సర్దార్ మూడు రోజుల కలక్షన్స్

ఖమ్మం జిల్లాకు చెందిన కిరణ్ కుమార్.. సుధారాణి దంపతుల గారాల పట్టి లక్ష్మీ శ్రీజ మూడో తరగతి చదువుతోంది. ప్రశ్నలు వేయాలే కానీ.. సివిల్స్ కు ప్రిపేర్ అయ్యే వారు సైతం చెప్పలేని చాలా ప్రశ్నలకు, మరి ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన సంగతులు.. తెలంగాణ చరిత్ర.. అనంతర పరిణామాల మీద గుక్క తిప్పుకోకుండా శ్రీజ సామాధానం చెప్పేస్తుంది.ఈ చిచ్చర పిడుగు మాటలు వింటే విస్మయం చెందాల్సిందే.

ఇవి కూడా చదవండి:ఆ హీరోయిన్ కాళ్ళు నొక్కిన హీరో

ఇక వెరైటీ ప్రదర్శించే కెసిఆర్త న ఇంటికి ఆ చిన్నారిని.. వారి తల్లిదండ్రుల్ని ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీజతో మాట్లాడిన కేసీఆర్.. ఆమె మేధస్సుకు మురిసిపోయారు. సంతోషం పట్టలేక.. అప్పటికప్పుడు 10లక్షల 16 రూపాయిల చెక్కును తన సొంత ఖాతా నుంచి తీసి ఇవ్వటమే కాదు, వారితో కలిసి భోజనం చేశారు. బాగా చదువుకోవాలని శ్రీజను ఆశీర్వదించారు. తాను వీలు చూసుకొని శ్రీజ ఇంటికి వస్తానని.. భోజనం చేస్తానని ఆయన చెప్పటం విని ఆ చిన్నారి.. వారి తల్లిదండ్రులు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. తమను పాలించే నేత నోటి నుంచి అలాంటి స్పందన వస్తే ఎవరు మాత్రం ఉబ్బితబ్బబ్బవకుండా ఉంటారు చెప్పండి? దటీజ్ కేసిఆర్ స్టైల్ .

ఇవి కూడా చదవండి:

ఎన్టీఆర్ కి తండ్రిగా సూపర్ స్టార్

త్రివిక్రమ్ భార్యను చూశారా?

తొలిరాత్రి కన్య కాదని భార్యను చంపేసాడు

English summary

Telangana Chief Minister KCR Praises Srija and He Gifted 10 Lakhs 16 thousand rupees for her. KCR said her to study well and he also eat lunch with her. She was a very talented girl She used to answer all the questions very well.