పవన్ స్పీచ్ కోసం కవిత తహ తహ!

KCR daughter Kavitha very interest on Pawan Kalyan speech

04:47 PM ON 27th August, 2016 By Mirchi Vilas

KCR daughter Kavitha very interest on Pawan Kalyan speech

పవర్ స్టార్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ సభలో స్పీచ్ అంటే అందరిలోనూ తెలియని ఒక ఆసక్తి నెలకొంటుంది. నిజానికి - పవన్ స్పందన కోసం ఆంధ్రా ప్రజలు ఎక్కువ ఎదురుచూస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే ప్రత్యేక హోదాపై తాజాగా ఎంత రగడ జరుగుతోందో తెలిసిందే. కేంద్రం ఇచ్చేది లేదు పొమ్మంటోంది. ఆర్థిక ప్యాకేజీ ఇచ్చేసి చేతులు దులిపేసుకుందామన్న ధోరణిలో ఉంది. కేంద్రంపై పోరాడి సాధించుకుందాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతూ ఉన్నా.. ఆ పోరాట కార్యాచరణ ఏంటనేది ఇంకా స్పష్టత రావడం లేదు. ఈ నేపథ్యంలో పవన్ స్పందిస్తారు అని ఎదురుచూశారు. అనూహ్యంగా ఈరోజు(శనివారం) తిరుపతిలో సభను ఏర్పాటు చేశారు పవర్ స్టార్.

దీంతో ఏపీలో అందరూ ఆసక్తిగా పవన్ ప్రసంగం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే విచిత్రంగా తెలంగాణ ఎంపీ - ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత కూడా పవన్ కల్యాణ్ ప్రసంగం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. తిరుపతిలో జరిగే బహిరంగ సభపై ఆమె ఎనలేని ఆసక్తికనబరుస్తున్నట్టు సమాచారం. నిజానికి - పవన్ కల్యాణ్ పై మొదట్లో బానే సెటైర్లు వేసినవారిలో కవిత ముఖ్యమైన వ్యక్తి. ఇక సీఎం కేసీఆర్ సంగతైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవన్ మీద ఎన్నో వ్యంగాస్త్రాలు సంధించారు. తిరుపతి సభలో తెలంగాణకు సంబంధించిన కొన్ని అంశాలను కూడా పవన్ ప్రస్థావించే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఇటీవల చోటు చేసుకున్న ఎంసెట్-2 లీకేజీ వ్యవహారం - మల్లన్నసాగర్ నిర్వాసితుల ఆందోళనపై పవన్ స్పందించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతోపాటు తెలంగాణలో రైతుల సమస్యలపై కూడా పవర్ స్టార్ మాట్లాడొచ్చు. ఇంతకీ కవితకు అంత ఆతృత ఎందుకంటే, కొన్నాళ్ల కిందట ఒక అభిమానిని పలకరించేందుకు పవన్ కల్యాణ్ ఖమ్మం వెళ్ళాడు. ఆరోజున అభిమానులు వెల్లువెత్తారు. తెలంగాణలో కూడా పవన్ కల్యాణ్ కు పెద్ద సంఖ్యలోనే ఫ్యాన్స్ ఉన్నారు. తెలంగాణ సమస్యలపై కూడా పవన్ మాట్లాడితే బాగుండు అనే అభిప్రాయం చాలామంది అభిమానులకు ఉంది.

అభిమానుల మనోగతం పవన్ వరకూ చేరిందని అందుకే తిరుపతి సభలో తెలంగాణ రాష్ట్ర సమస్యలపై కూడా పవన్ స్పందించి కేసీఆర్ సర్కారుపై స్పందించే అవకాశం ఉందని అంటున్నారు. అందుకే పవన్ స్పీచ్ కోసం నిజామాబాద్ ఎంపీ కవిత ఆసక్తి చూపుతున్నారని అంటున్నారు. తిరుపతి సభలో తెలంగాణ సమస్యలపై పవన్ స్పందిస్తే... వెంటనే కవిత ప్రతిస్పందన కూడా వుండే అవకాశం వుంది. మొత్తానికి పవన్ ఏమి చెప్పబోతున్నాడో ఏపీలో కన్నా, తెలంగాణాలోనే ఎక్కువ ఆసక్తి కనిపిస్తోంది.

ఇది కూడా చదవండి: ఒకనాడు ఒలింపిక్స్ ఛాంపియన్.. ఇప్పుడు పూరీలు అమ్ముకుంటోంది!

ఇది కూడా చదవండి: ఆడవాళ్లు జీవించలేని ప్రమాదకరమైన దేశాలు ఇవే!

ఇది కూడా చదవండి: నడిరోడ్డుపై నీలిచిత్రాలు చూస్తూ అడ్డంగా బుక్కయ్యాడు!

English summary

KCR daughter Kavitha very interest on Pawan Kalyan speech. KCR daughter Kavitha is waiting for Pawan Kalyan speech on today in Tirupati.