పావలా శ్యామలకు కెసిఆర్ పట్ల ఎందుకు కృతజ్ఞత

KCR Donation To Actress Syamala

07:25 PM ON 18th January, 2016 By Mirchi Vilas

KCR Donation To Actress Syamala

ఈ చిత్రం చూడగానే సినీ క్యారక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల ఎందుకు కెసిఆర్ కు కృతజ్ఞతగా నమస్కారం పెడుతోంది. అసలు ఏం అయింది. చిన్న చిన్న ఆర్టిస్టులకు అసలు కెసిఆర్ ఇంటర్యూ దొరుకుతుందా? వంటి ప్రశ్నలు ఉదయిస్తాయి. ఒక్కటి మాత్రం నిజం కష్టాల్లో ఉన్నవాళ్ళను చూస్తే చలించి సాయం అందించే సుగుణం కెసిఆర్ లో మెండుగా వుందని చెబుతుంటారు. బహుశా ఇది కూడా అలాంటిదేమో...

ఓసారి వివరాల్లోకి వెళితే, సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాల్లో నటించి, తెలుగువారికి సుపరిచితురాలైన పావలా శ్యామల పేదరికం గురించి ఓ పత్రికలో కథనాన్ని చదివిన కేసీఆర్ చలించిపోయారు. సీఎం క్యాంప్ ఆఫీసులో కూతురితో పాటు కలిసిన శ్యామలకు రూ.20వేలు ఆర్థిక సాయం అందించడంతో పాటూ, డబుల్ బెడ్ రూం ప్లాట్ కేటాయించాలని అధికారుల్ని ఆదేశించారు. ఇక.. ప్రతినెలా రూ.10వేలు చొప్పున పింఛన్ ఇవ్వాలంటూ సాంస్కృతిక శాఖకు ఆదేశాలు కూడా జారీ చేశారు. మొత్తానికి కెసిఆర్ తెలుగు నటీనటుల పట్ల బానే స్పందిస్తున్నారని అనుకోవాలా?

English summary

Telangana Cheif Minister KCR Donates 20 thousand to Actress Syamala. And he also said that he is going to give her a double bed room flat and 10 thousand rupees pension every month