తెలుగు తమ్ముళ్ళకు ఆగ్రహం కల్గించిన  ఫ్లెక్సీ

KCR Flexi IN Kakinada

11:43 AM ON 9th January, 2016 By Mirchi Vilas

KCR Flexi IN Kakinada

మన గురించి చెప్పాపోయినా పర్వాలేదు గానీ , ప్రత్యర్ధి గురించి చెబితే భగ్గున లేస్తారు ఎవరైనా... కోపంతో రగిలిపోతారు. అందునా నిత్యం కంట్లో నలుసుగా వుండే పక్క రాష్ట్రం నేత ఫోటో గానీ , ఫ్లెక్స్ గానీ పెడితే ఇంక చెప్పక్కర్లేదు. ఆగ్రహం తో ఊగిపోతారు. సరిగా అదే జరిగింది ఇక్కడ. వివరాల్లోకి వెళితే,

కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరిస్తూ చర్యలు చేపట్టాలని ఎపిలో కాంట్రాక్ట్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇదే పని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణాలో చేయడంతో కెసిఆర్ ని అభినందిస్తూ తూర్పుగోదావరి జిల్లా వై.రామవరం మండల కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. "తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగుల చీకటి జీవితాలలో వెలుగును ప్రసాదించిన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గార్కి మా శతకోటి అభివందనములు" అంటూ ఆ ఊళ్ళో ఫ్లెక్సీ దర్శన మిస్తోంది.

కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని సీఎం కేసీఆర్ పలుమార్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మేరకు ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుని అమలుకు చర్యలు చేపట్టింది. అయితే దీన్ని అభినందిస్తూ ఎపిలో కెసిఆర్ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం తెలుగు తమ్ముళ్ళకు కోపం తెచ్చింది. ఈ ఘటనపై తెలుగుదేశం పార్టీ నాయకులు భగ్గుమంటున్నారు. కెసిఆర్ ఫ్లెక్సీలు పెట్టడమంటే , పరోక్షంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అవమానించడమే అవుతుందని తెలుగు తమ్ముళ్ళు భావిస్తున్నారు. అందుకే ఆ ఫ్లెక్సీలను తొలగించాలని పంచాయతీ కార్యదర్శికి తెలుగు తమ్ముళ్ళు విజ్ఞప్తి చేసారు.

English summary

Some of the Contract employees in Kakinada demanding for the rise in their salaries by putting KCR flexies in Y.Rayavaram Mandalam,Kakinada.Due to tghis TDP members were angry.