రవి శంకర్ గురూజిని ఆహ్వానించిన కెసిఆర్ 

KCR Invites Ravi Shankar

06:00 PM ON 15th December, 2015 By Mirchi Vilas

KCR Invites Ravi Shankar

ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవి శంకర్ గురూజీ ని అయుత చండీ యాగానికి రావాల్సిందిగా తెలంగాణా సిఎమ్ కెసిఆర్ ఆహ్వానించారు. ఇప్పటికే పలువురు ప్రముఖులను ఆహ్వానించిన కెసిఆర్ నిన్నటి రోజున విజయవాడ వెళ్లి ఎపి సిఎమ్ చంద్రబాబుని ఆహ్వానించిన సంగతి తెల్సిందే.

నిన్న సాయంత్రం సతీ సమేతంగా గవర్నర్ నరసింహం ని కల్సి యాగానికి కెసిఆర్ ఆహ్వానించారు. ఈరోజు షిల్లాంగ్ లో వున్న రవిశంకర్ గురూజిని వీడియో కాల్ ద్వారా మాట్లాడి , యాగానికి ఆహ్వానించారు. రవిశంకర్ గురూజీ సానుకూలంగా స్పందించారు. మొత్తానికి యాగం పేరిట అందరినీ ఆహ్వానిస్తున్న సిఎమ్ కెసిఆర్ ఎలాంటి ఫలితం పొందబోతున్నారో.

English summary

Telangana Cheif Minister KCR invites Art Of Living Founder Ravi Shankar Guruji To Ayutha Chandi Yagam