బాలయ్యను ఓ కోరిక కోరిన కెసిఆర్

Kcr Special Request For Balakrishna

09:52 AM ON 23rd April, 2016 By Mirchi Vilas

Kcr Special Request For Balakrishna

ఎవరిని బహిరంగంగా ఏ కోరికా కోరని తెలంగాణా సిఎమ్ కెసిఆర్ ఉన్నట్టుండి బాలయ్య ను ఓ కోరిక కోరారు. బాలయ్య వందో చిత్రం ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ ప్రారంభం సందర్భంగా విశిష్ఠ అతిధిగా హాజరైన కెసీఆర్ చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈ చిత్రం 200 ఆడుతుందని చెప్పిన కెసిఆర్ మరీ.. ముఖ్యంగా తనదో కోరిక ఉందని.. దాన్ని తీర్చాలంటూ బాలకృష్ణను అడిగారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నోటి నుంచి ఏం కోరిక రానుందన్న ఆసక్తి వ్యక్తమైంది. ఆ కోరిక ఏమిటా అని అందరూ అనుకుంటున్న సమయంలో కెసిఆర్ తన స్పీచ్ కొనసాగిస్తూ, ‘‘ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యాక.. తొలిసారి వేసే షోకి నన్ను పిలవాలని కోరుకుంటున్నా. ఇది చారిత్రక సినిమా. ఈ సినిమా షోను కుటుంబ సమేతంగా వచ్చి చూస్తా. ఈ వేదిక మీదున్న బ్యాచ్ అంతా ఆ మొదటి షోను చూడాలి. ఆ మొదటి బ్యాచ్ లో నేనూ ఉండాలె’’ అంటూ చారిత్రక సినిమాల మీద తనకున్న మక్కువను కేసీఆర్ మరోసారి బయటపెట్టారు.

ఇవి కూడా చదవండి:

ఆ పని చేయలేదని 250 మంది అమ్మాయిలను నరికేశారు

కారు నడుపుతూ ఆ..పని కానిచ్చాడు..యాక్సిడెంట్ చేసాడు

రోజా జబర్దస్త్‌కు టాటా చెప్పింది ఇందుకేనా?

English summary

Telangana Chief Minister KCR attended as Chief Guest to the Balakrishna's 100th movie launch event and KCR requested Balakrishna to call him for Special Show of the movie.