ఈ వస్తువులు మీ పర్స్ లో ఉంటే ఇక అంతా బంగారమే!

Keep these thing in your wallet for best life

01:22 PM ON 25th July, 2016 By Mirchi Vilas

Keep these thing in your wallet for best life

ప్రతి ఒక్కరి జీవితం ఆనందంగా ముందుకు సాగాలంటే.. డబ్బు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందుకే.. డబ్బు సంపాదించడం కోసం ప్రతి ఒక్కరూ చాలా కష్టపడుతూ ఉంటారు. అయితే చాలామంది తక్కువ సంపాదిస్తున్నా.. బాగా దాచుకునే తత్వం కలిగి ఉంటారు. కానీ కొంతమంది ఎంత సంపాదించినా.. దాన్ని దాచిపెట్టుకోలేకపోతారు. ఎంత సంపాదించినా.. డబ్బు లేదన్న మాట వింటూ ఉంటాం. ఎప్పుడూ డబ్బులు చేతిలో ఉండాలంటే సంపాదిస్తే సరిపోదు.. దాన్ని కాపాడుకునే అదృష్టం కూడా ఉండాలి. ప్రతీ ఒక్కరు తమ డబ్బు దాచుకోవడానికి పర్స్ లేదా హ్యాండ్ బ్యాగ్ కచ్చితంగా వాడతారు.

మీ డబ్బు ఎప్పుడూ నిలువ ఉండాలంటే మీ పర్స్ లో ఎప్పుడూ ఈ వస్తువులు ఉండాలి!ఇందులో చాలా ముఖ్యమైన వస్తువులు(డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు వంటివి) పెట్టుకుంటాం. డబ్బులు కాకుండా, ఇంకా విలువైన వస్తువులు కూడా పర్స్ లో పెట్టుకుంటూ ఉంటాం. కొంతమంది తమకు ఇష్టమైన వాళ్ల ఫోటోలు, భార్యల ఫోటోలు, తల్లిదండ్రుల ఫోటోలు పర్స్ లో పెట్టుకుంటారు. మరికొందరు దేవుళ్ల ఫోటోలు పర్స్ లో పెట్టుకుంటారు. అయితే.. కొన్ని వస్తువులను మీ పర్స్ లో పెట్టుకుంటే.. ఎప్పుడూ అదృష్టం మీ వెంటే ఉంటుందట. మీరు ఎప్పుడూ అదృష్టవంతులుగా ఉండాలంటే.. ఈ వస్తువులను కచ్చితంగా పర్స్ లో పెట్టుకోవాలి. అవేంటో మనం ఇప్పుడు చూద్దాం..

1/19 Pages

18. డబ్బుని ఎలా పడితే అలా పడేయకూడదు:


మాములుగా చాలా మంది బ్యాగ్ లో డబ్బులను విసిరేస్తూ ఉంటారు. ముఖ్యంగా చిల్లర పైసలని ఎలా పడితే అలా వేసేస్తూ ఉంటారు. ఇది డబ్బుపై ఉన్న అగౌరవాన్ని సూచిస్తుంది. కాబట్టి.. చిల్లర పెట్టుకోవడానికి ఒక చిన్న పర్స్ ని హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకోవడం చాలా మంచిది.

English summary

Keep these thing in your wallet for best life