జనవరి లో అమెరికాలో  కీరవాణి సంగీత విభావరి

Keeravani Musical Show In America

06:59 PM ON 4th November, 2015 By Mirchi Vilas

Keeravani Musical Show In America

మెలోడి బాణీలతో, సినీ సంగీత ప్రపంచం లో శ్రోతలను ఓలలాడిస్తున్న ప్రముఖ సినీసంగీత దర్శకుడు, గాయకుడు ఎం.ఎం కీరవాణి వచ్చే జనవరి లో అమెరికాలో సంగీత విభావరి నిర్వహించనున్నారు. మొత్తం 6 నగరాల్లో కీరవాణి సంగీత విభావరి జరగనుంది. అన్నమయ్య , శ్రీ రామదాసు వంటి ఆధ్యాత్మిక చిత్రాలతో పాటు బాహుబలి, సింహాద్రి, క్రిమినల్, యమదొంగ, స్టూడెంట్ నెంబర్వన్, ఛత్రపతి, విక్రమార్కుడు.. ఇంకా ఎన్నో చిత్రాలకు సంగీతం అందించి, వీనులవిందు గా బాణీలు సమకూర్చిన కీరవాణి పలు చిత్రాలలో హిట్ సాంగ్స్ కూడా ఆలపించారు. ఇప్పుడు పశ్చిమాన అమెరికాలో సంగీత విభావరి చేయబోతున్నారు. బాహుబలి సినిమాతో కీరవాణి పేరు ప్రఖ్యాతులు విశ్వవ్యాప్తం అయ్యాయి.

English summary

M.M.Keeravani To Host A Musical Show In America On January 2016.He is A popular Music Director.His Latest Sensation Bahubali creates a new record in Indian Film Industry,.