మహేష్‌ ని పడేసిన 'శైలజ'

Keerthy suresh acts in Mahesh Babu film

04:16 PM ON 22nd February, 2016 By Mirchi Vilas

Keerthy suresh acts in Mahesh Babu film

'నేను శైలజ' చిత్రంతో తెలుగులో అర్రంగేట్రం చేసిన మలయాళీ భామ కీర్తి సురేష్‌. ఇటు టాలీవుడ్‌ లోను అటు కోలీవుడ్‌ లోనూ మంచి పేరు తెచ్చుకుంటూ ఎదుగుతున్న కీర్తి సురేష్‌ కు ఇప్పుడు బంపర్‌ ఆఫర్‌ తగిలింది. ఎంతో పద్దతిగా ఎక్స్‌పోజింగ్‌ కి కాస్త దూరంగా వుంటూ శైలజ పాత్రలో తెలుగు ప్రేక్షకులను అలరించిన కీర్తి టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు సరసన నటించే ఛాన్స్‌ కొట్టేసింది ఈ మలయాళీ బ్యూటీ.

మురుగదాస్‌ దర్శకత్వం భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తున్న సినిమాలో మహేష్‌బాబు హీరో కాగా హీరోయిన్‌ గా కీర్తిని ఎంపికచేసాడట. హీరోయిన్‌ పాత్రకు సంప్రదాయంగా కన్పించే కీర్తి ఈ పాత్రకు సరిగ్గా సరిపోతుందని డైరెక్టర్‌ మురుగదాస్‌ అభిప్రాయ పడ్డారు. అందుకే కీర్తి సురేష్‌ను మహేష్‌ కు జోడిగా ఫైనల్‌ చేశాడట. 'నేను-శైలజ' లో ఆమె నటన బాగా నచ్చడంతో మురగదాస్‌ ఆమె పేరును చెప్పగానే మహేష్‌ కూడా వెంటనే ఓకే చెప్పాడట. బాహుబలి తర్వాత తెలుగులో రూపొందుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం ఇదేనట. ఇంత మంచి చాన్స్‌ కొట్టేసిందంటే ఈ చిన్నది చాలాలక్కీ అనుకోవాల్సిందే.

English summary

Tollywood superstar Mahesh Babu in the film to be directed by A.R.Murugadoss. Now a source close to the director reveal that Keerthy is indeed part of the film.