హెచ్‌సియు ఘటనపై నిప్పులు చెరిగిన  కేజ్రీ

kejriwal fires on HCU incident

06:37 PM ON 21st January, 2016 By Mirchi Vilas

kejriwal fires on HCU incident

ఎన్ డి ఎ మీద మరీ ముఖ్యంగా బిజెపి మీదా, ఇంకా చెప్పాలంటే ప్రధాని మోడీ మీద, వీలు దొరికితే చాలు విరుచుకు పడ్తున్న డిల్లీ సిఎమ్ అరవింద్ కేజ్రీవాల్ కి సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్ సి యూ) లో పీహెచ్ డీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య వ్యవహారం భలే అందివచ్చింది. డిల్లీలో మొన్ననే ఈ ఘటనపై స్పందించిన కేజ్రీ గురువారం ఏకంగా హెచ్ సి యూ కి చేరుకొని మోడీ సర్కార్ ని చెడా మడా దుమ్మెత్తి పోశారు.

రోహిత్ ఉదంతంపై విద్యార్థి నేతలతో మాట్లాడిన అనంతరం ఆందోళన చేస్తున్న వారిని ఉద్దేశించి కేజ్రీ మాటాడుతూ, కేంద్ర ప్రభుత్వంపై విమర్శ నాస్త్రాలు సంధించారు. ప్రధాని మోడీ మీద దేశంలోని విద్యార్థులు ఆగ్రహంగా ఉన్నార ని ఆయన పేర్కొంటూ, మోడీ విద్యార్థులతో పెట్టుకోకుండా ఉండటం మంచిదని హితవు పలికారు. రోహిత్ ఆత్మహత్య బాధితుల్ని వెంటనే అరెస్ట్ చేయాలని, కేంద్రం నుంచి వచ్చిన లేఖలతో పాటు ఢిల్లీ నుంచి వచ్చిన కాల్ రికార్డును బయటకు తీయాలని, ఈ ఘటనలో బాధ్యత ఉన్న వారందరినీ అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేసారు.

కేంద్రమంత్రి దత్తాత్రేయ లేఖతోనే విద్యార్థులను సస్పెండ్ చేశారని కేజ్రీ ఆరోపిస్తూ, హెచ్చార్డీ నుంచి వచ్చిన లేఖతో వీసీ మారిపోయారని, కొత్తగా వచ్చిన వీసీ విద్యార్థుల పైన చర్యలు తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. వీసీని సస్పెండ్ చేయాల ని, ఈ వ్యవహారాన్ని తప్పుదారి పట్టించిన కేంద్రమంత్రి స్మృతి ఇరానీ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేసారు. కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ.. బండారు దత్తాత్రేయలను పదవుల నుంచి తప్పించాలన్నారు. 'జై భీమ్ - రోహిత్ అమర్ రహే - వీ వాంట్ జస్టిస్' అంటూ నినాదాలు చేసి తన ప్రసంగాన్ని కేజ్రీ స్టార్ట్ చేశారు.

English summary

Delhi CM Arvind Kejriwal to visit HCU today. kejriwal fires on HCU incident.