ఖంగుతిన్న కేజ్రీవాల్

Kejriwal Principal Secretary Rajendra Kumar Arrested By CBI

11:36 AM ON 5th July, 2016 By Mirchi Vilas

Kejriwal Principal Secretary Rajendra Kumar Arrested By CBI

ఢిల్లీకి కేజ్రీవాల్ సీఎం అయ్యాక మొదటి నుంచి కేంద్రానికి , ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సయోధ్య లేదు. చీటికీ మాటికీ ప్రధాని మోడీపై కేజ్రీ విరుచుకు పడుతున్నారు. దీంతో ఢిల్లీ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకీ వేడెక్కుతున్నాయి. కేంద్రంలోని బిజెపికి, రాష్ట్రంలోని ఆప్ కు పచ్చగడ్డేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇరుపక్షాల మధ్య ఎడ్డం అంటే తెడ్డంలా వ్యవహారం నడుస్తోన్న నేపథ్యంలో ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ కు నరేంద్ర మోడీ సర్కారు మరోసారి షాకిచ్చింది. కేజ్రీవాల్ కు ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్న రాజేంద్ర కుమార్ ను సిబిఐ సోమవారం అరెస్ట్ చేసింది. అవినీతి కేసులో రాజేంద్ర కుమార్ తో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకుంది. రాజేంద్ర కుమార్ పై అవినీతి ఆరోపణలు రావడంతో గతేడాది ఢిల్లీ సెక్రటేరియట్ లో సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించారు.

తమ అనుమతి లేకుండా సిబిఐ అధికారులు ఢిల్లీ సెక్రటేరియట్ నుంచి ఫైల్స్ తీసుకెళ్లడంపై అప్పట్లో కేజ్రీవాల్ మండిపడ్డారు. ఇదంతా మోడీ సర్కారు కక్ష సాధింపే అని తేల్చేశారు. తాజా అరెస్ట్ తో మరో సారి ఇరుపార్టీలు విమర్శలు గుప్పించుకుంటున్నాయి. రాజేంద్ర అరెస్ట్ పై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా స్పందిస్తూ ఏ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ స్థాయికి దిగజారిపోవడం తాను చూడలేదన్నారు.

ఇవి కూడా చదవండి:కొడుకును వెయ్యికి అమ్మేసాడు.. ఎందుకో తెలుసా?

ఇవి కూడా చదవండి:అమెరికాలో తెలంగాణ ఎంఎల్ఏ సీరియస్

English summary

Delhi Chief Minister Aravind Kejriwal Principal Secretary Rajendra Kumar Arrested By CBI over 50 crore money scam and AAP leaders were fired on Central Government for doing such things and they were responded seriously on Narendra Modi.