డీడీసిఏలో కామాంధులు : కేజ్రీవాల్‌ 

Kejriwal Sensational Comments On DDCA

03:34 PM ON 30th December, 2015 By Mirchi Vilas

Kejriwal Sensational Comments On DDCA

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌, కేంద్రం ప్రభుత్వానికి మధ్య మాటలయుద్దం గత కొద్ది రోజులుగా సాగుతున్న విషయం తెలిసిందే. కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ ఢిల్లీ డిస్ట్రిక్ట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అనేక అవకతవకలకు పాల్పడ్డారని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే.

కేజ్రీవాల్‌ వ్యాఖ్యలను పలువురు మంత్రులు, క్రికెటర్లు ఖండించారు. పలు రంగాలకు చెందిన క్రీడాకారులు సైతం అరుణ్‌ జైట్లీకు అండగా నిలిచారు. అయితే ఈ వివాదం పై కేజ్రీవాల్‌ మరో వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక టీవి ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో ఈ అంశం పై కేజ్రీవాల్‌ మాట్లాడుతూ డీడీసిఏ అధికారులు కామాంధులని వారు పలువురి పై లైంగిక దాడులకు కూడా పాల్పడ్డారని విమర్శించారు. కేజ్రీవాల్‌ మాట్లాడుతూ ఒకరోజు ఒక జర్నలిస్ట్‌ తనకు ఫోన్‌చేసి తన కుమారుడు ఢిల్లీ క్రికెట్‌ టీంకు ఎంపిక అయ్యాడని చెప్పాడని అన్నాడు. కానీ దాని తరువాత రోజు డీడీసిఏ వారు విడుదల చేసిన జాబితాలో ఆ జర్నలిస్ట్‌ కుమారుడి పేరు లేదని అన్నారు. కాగా జర్నలిస్ట్‌ భార్యకు ఢిల్లీ క్రికెట్‌ అసోసియేషన్‌ లోని ఒక అధికారి నుండి ఫోన్‌కు మెసేజ్‌ వచ్చింది అని, ఆ మెసేజ్‌లో "ఈరోజు నా ఇంటికి వస్తే, నీ కుమారుడి పేరును క్రికెట్‌ టీం జాబితాలో చేరుస్తామని" మెసేజ్‌లో ఉన్నట్లు కేజ్రీవాల్‌ తెలిపాడు. ఇలాంటి మరెన్నో దారుణాలకు డీడీసిఏ అధికారులు పాల్పడ్డారని అన్నారు. దీని పై ఢిల్లీ ప్రభుత్వం విచారణకు మాజీ సొలిసిటర్‌ జనరల్‌ గోపాల సుబ్రమణ్యం నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేసామని కేజ్రీవాల్‌ అన్నారు.

అయితే ఈ విచారణ కమిటీ పై బీజెపి ఇది ఒక రాజకీయ జిమ్మికు చర్యగా పోల్చింది. ఎవరు ఎమన్నా ఈ అంశం పై గోపాల సుబ్రమణ్యం కమిటీ విచారణ కొనసాగుతుందని కేజ్రీవాల్‌ స్పష్టం చేసారు.

English summary

Kejriwal Sensational Comments On Delhi and District Cricket Association (DDCA)