ఊపిరితిత్తులను ట్వీట్‌ చేసిన కేజ్రీవాల్‌

Kejriwal tweets picture of Lungs Photos

12:22 PM ON 12th December, 2015 By Mirchi Vilas

Kejriwal tweets picture of Lungs Photos

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ నగరంలో కాలుష్య ప్రమాదకర స్థాయిని గురించి వివరిస్తూ ప్రజలను చైతన్య పరచడం కోసం తన ట్విట్టర్‌ ఖాతాలో రెండు ఊపిరితిత్తుల ఫోటోలను పెట్టారు.

కేజ్రీవాల్‌ పెట్టిన ఈ రెండు ఊపిరితిత్తుల ఫోటోలలో ఒక ఫోటో హిమాచల్‌ ప్రదేశ్‌ కు చెందిన 55 ఏళ్ళ వ్యక్తిది కాగా మరో ఫోటో ఢిల్లీకు చెందిన 52 ఏళ్ళ వ్యక్తిది అని కేజ్రీవాల్‌ తెలిపారు. ఈ ఫోటోలను ప్రఖ్యాత కార్డియోథారాసిక్‌ సర్జన్‌ డాక్టర్‌ నరేష్‌ ట్రీహాన్‌ తనకు పంపినట్లు కేజ్రీవాల్‌ తెలిపారు.

ఆ ఫోటోలలో ఢిల్లీకి చెందిన వ్యక్తి ఊపిరితిత్తులు ముదురు నలుపు రంగులో కనిపిస్తుండగా మరొకటి ఆరోగ్యకరంగా కనిపిస్తున్నాయి. ముదురు నలుపు రంగులో ఉన్న ఊపిరితిత్తులు కాలుష్యం కారణంగా బొగ్గు శాతం ఎక్కువగా ఉందని డాక్టర్‌ ట్రీహాన్‌ ఒక వార్తా ఛానెల్‌ విలేకరితో అన్నారు.

దేశ రాజధాని కాలుష్యం స్థాయి బాగా పెరిగిపోతుండడంతో ఢిల్లీ హైకోర్టు ఢిల్లీ నగరాన్ని గ్యాస్‌ ఛాంబర్‌తో పోల్చింది. ఈ కాలుష్యం స్థాయి బీజింగ్‌ నగరంలో కంటే ఒకటిన్నర శాతం ఎక్కువ స్థాయిలో కాలుష్యం ఉందని, రోజుకు సాధారణంగా శ్వాసతీసుకోవడం ద్వారా 40 సిగరెట్లను కాల్చిన దానితో సమానంగా ఉందని అని అన్నారు.

గత ఏడాది ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన అధ్యాయనంలో ప్రపంచ వ్యాప్తంగా 1600 డర్టీయస్ట్‌ నగరాల్లో ఢిల్లీ కూడా 2.5 కాలుష్యం కణాలతో ఆ లిస్ట్ లో ఉంది.

English summary

Delhi chief minister Arvind Kejriwal has posted two pictures of the lungs of two different people on Twitter in an attempt to educate the citizens about the hazardous levels of pollution in the city