పాపం... గిన్నెలు కడిగిన కేజ్రీ..

Kejriwal washing dishes

03:04 PM ON 19th July, 2016 By Mirchi Vilas

Kejriwal washing dishes

ఒక్కోసారి కొన్ని పనులు కల్సి వస్తే, మరోసారి వెక్కిరిస్తాయి. మరికొన్ని పనులు కొంప ముంచుతాయి. అన్ని వేళలా ఒకేలా ఉండవని అందుకే అంటారు కదా... సరిగ్గా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విషయంలో అదే జరిగింది. ఈయన ఎన్నికల గుర్తు చీపురు అన్నైపార్టీలను తుడిచిపెట్టేస్తే, ఈ గుర్తు ఇప్పుడు ఓచోట ఆగ్రహానికి గురి చేసింది. అందుకే ఈయన స్వయంగా గిన్నెలు కడిగారు. ఆశ్చర్యకరమైన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. త్వరలో జరిగే పంజాబ్ ఎన్నికలకు సంబందించి ఆప్ యువజన విభాగం ఒక మేనిఫెస్టోను విడుదల చేసింది. దాని కవర్ పేజీపై గోల్డెన్ టెంపుల్ తో పాటు ఆప్ ఎన్నికల గుర్తు చీపురును కూడా ముద్రించారు.

గుడి వెనుక చీపురు గుర్తు ఉండడం చూసి, సిక్కులు ఫైర్ అయ్యారు. దీంతో కేజ్రీవాల్ పశ్చాత్తాపంగా తనకు తానే శిక్ష విధించుకున్నారు. అందులో భాగంగానే సోమవారం అమృతసర్ లోని గోల్డెన్ టెంపుల్ కు వెళ్లిన కేజ్రీవాల్ అక్కడి వంటశాలలో గిన్నెలు కడిగి శుభ్రం చేశారు. అదండీ సంగతి.

English summary

Kejriwal washing dishes