ఉగ్రవాదుల సరసన కేజ్రీవాల్?

Kejriwal with terrorists

04:36 PM ON 15th October, 2016 By Mirchi Vilas

Kejriwal with terrorists

అవునా, ఓ రాష్ట్రానికి అందునా కేంద్రానికి పక్కలో బల్లెంలా వ్యవహరిస్తున్న కేజ్రీవాల్ ఫోటో ఉగ్రవాదుల సరసన ఉందా? మొత్తానికి గుజరాత్ పర్యటనకు ముందు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. గుజరాత్ లో ఆయన పర్యటించనున్న పట్టణాల్లో వెలసిన వివాదాస్పద పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. కరుడుగట్టిన ఉగ్రవాదులు ఒసామా బిన్ లాడెన్, హఫీజ్ సయీద్, హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వనీల ఫొటోల మధ్య అరవింద్ కేజ్రీవాల్ ఉన్న బ్యానర్లు దర్శనమిస్తున్నాయి. ఫోటోల పైన పాకిస్థాన్ హీరోలు అని రాసి ఉంది. వీటిని గమనించిన ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు వెంటనే వాటిని తొలగించారు.

పీవోకేలోని ఉగ్రశిబిరాలపై భారత ఆర్మీ జరిపిన సర్జికల్ దాడులకు సంబంధించిన సాక్ష్యాలు విడుదల చేయాలని అరవింద్ కేజ్రీవాల్ మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. పటేల్ ఉద్యమంలో భాగంగా ఉంజాలో మృతి చెందిన వారి కుటుంబాలను కేజ్రీవాల్ శనివారం పరామర్శించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను దేశద్రోహిగా పేర్కొంటూ కొందరు ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అలాగే ఆదివారం కేజ్రీవాల్ పర్యటించనున్న సూరత్ లోనూ ఈ పోస్టర్లు వెలిశాయి. కాగా ఇదంతా బీజేపీ కుట్రేనని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. ఆప్ ఆరోపణలను బీజేపీ కొట్టిపడేసింది. అది బీజేపీ పని కాదని, భారత్ ను అభిమానించేవారే అలా చేసి ఉండొచ్చని పేర్కొంది. సర్జికల్ దాడులను కేజ్రీవాల్ ప్రశ్నించడం గుజరాతీను తీవ్రంగా బాధించిందని అందుకే ఇలా చేసి ఉండొచ్చని బీజేపీ అధికార ప్రతినిధి భరత్ పాండ్యా చెప్పుకొచ్చారు.

English summary

Kejriwal with terrorists