ఆయుర్వేద మందు రుచి చూసి కోమాలోకి వెళ్లిన వైద్యుడు మృతి

Kerala Ayurvedic doctor In Coma Since 9 Years

12:25 PM ON 13th September, 2016 By Mirchi Vilas

Kerala Ayurvedic doctor In Coma Since 9 Years

ఇదో అంతుబట్టని విషయం... లేకపోతే, ఒక రోగికి రాసిచ్చిన ఔషధాన్ని రుచి చూసిన ఆయుర్వేద వైద్యుడు కోమాలోకి పోవడమా? ఏకంగా తొమ్మిదేళ్లుగా కోమాలో ఉండిపోయిన ఆ వైద్యుడు చివరకు సోమవారం మరణించారు. వివరాల్లోకి వెళ్తే, కేరళలోని కొచ్చి సమీపంలో ఉన్న పైప్రా గ్రామానికి చెందిన డాక్టర్ పీ ఏ బైజూ, ప్రభుత్వ ఆయుర్వే వైద్య డిస్పెన్సరీలో వైద్య అధికారి గా వున్నాడు. ఆయన 2007 జనవరిలో ఒక మహిళకు కీళ్ల నొప్పుల ఔషధాన్ని ఇచ్చారు. దానిని వేసుకున్న ఆమె స్పృహతప్పి పడిపోయి కొద్దిసేపటికే కోలుకుంది. ఈ విషయాన్ని రోగి తరఫు బంధువులు బైజూకు చెప్పారు. అయితే, ఆ ఔషధం వల్ల ప్రమాదమేమీ ఉండదని చెబుతూ, దానిని ఆయన తిన్నారు. అంతే, దానిని తిన్న వెంటనే ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. గత తొమ్మిదేళ్లుగా కోమాలో ఉన్న ఆయన ఇప్పుడు తుదిశ్వాస విడిచారు. కాగా, రోగి భర్త ఆ ఔషధంలో పురుగుల మందు కలిపి బైజూకు ఇచ్చాడనే ఆరోపణలపై విచారణ జరుగుతోంది.

ఇది కూడా చూడండి: పాము కాటేస్తే ప్రాణాలు కాపాడుకోవడం ఎలాగో తెలుసా ?

ఇది కూడా చూడండి: శివ పూజకు వాడేవి, వాడకూడనివి ఏమిటో తెలుసా

ఇది కూడా చూడండి: రాత్రి ఏ దిక్కుకి తల పెట్టుకుని పడుకుంటే మంచిదో తెలుసా?

English summary

Ayurvedic Doctor who slipped into coma after tasting medicine. Doctor is in coma since 9 years recently he died.