బిషప్ కిడ్నీ హిందూ యువకుడికి డొనేట్

Kerala Bishop Donates Kidney To Hindu Boy

01:49 PM ON 30th May, 2016 By Mirchi Vilas

Kerala Bishop Donates Kidney To Hindu Boy

కుల మతాల కుమ్ములాటలతో అట్టుడికిపోతున్న ఈరోజుల్లో మానవత్వానికి మించిన మతం లేదని, త్యాగం కన్నా పరమార్థం లేదని చాటి చెప్పింది ఈ ఘటన. కేరళకు చెందిన ఓ బిషప్ ఇందుకు సజీవ తార్కాణంగా నిలిచారు. ఒక హిందూ యువకుడికి తన కిడ్నీని డొనేట్ చేసేందుకు ముందుకు వచ్చారు. కేరళలోని మల్లపురంలో ఉంటున్న 30 ఏళ్ల సూరజ్ కిడ్నీ ఫెయిల్యూర్తో ఏడాదిన్నర నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. కుటుంబాన్ని పోషించే వ్యక్తి అతనొక్కడే కావడం, పేదరికం, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సూరజ్ ఏడాదిగా డయాలిసిస్తోనే ప్రాణాలను నిలుపుకొంటున్నాడు. ఈ తరుణంలో కొట్టాయంలోని పలలో బిషప్ గా ఉంటున్న జాకోబ్ మురిక్కన్ నుంచి, కిడ్నీ ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ సమాచారం అందింది. దీంతో తన ఆనందానికి అవధులు లేవని జాకోబ్ చెప్పుకొచ్చాడు. తన ఆరోగ్యం బాగా క్షీణించిన తరుణంలో కిడ్నీ ఇవ్వడానికి బిషప్ ముందుకొచ్చారని తెలిసిందని, ఇది దైవ సంకల్పంగానే తాను భావిస్తున్నానని చెప్పాడు. కాగా, కిడ్నీ గ్రహీత మరో మతానికి చెందిన వాడనే భావన తనకెప్పుడూ కలగలేదని, సాటివారి మట్ల దయచూపడమనే సందేశాన్ని ఆచరణలో పెట్టేందుకు ఇది తనకు దక్కిన అవకాశంగా భావిస్తున్నానని బిషప్ మురిక్కిన్ తెలిపారు. అవయవ దానం నిజమైన సేవగా చర్చి, పోప్ ఫ్రాన్సిస్ పరిపూర్ణంగా విశ్వసిస్తుంటారని, ఆ స్ఫూర్తితోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. తన చర్య తక్కిన వారికి కూడా ఒక సందేశం కావాలని ఆయన అభిలషించారు. కాగా, సూరజ్కు జూన్ మొదటివారంలో వైద్యులు కిడ్నీ ఆపరేషన్ నిర్వహిస్తారు.

ఇవి కూడా చదవండి:బెట్టింగ్ లో ఓడిపోయాడని భార్యను తాకట్టు పెట్టేసాడు! ఆమె ఏం చేసిందో తెలుసా?

ఇవి కూడా చదవండి:తుపాకీతో కాల్చేసుకున్న మాజీ సీఎం మనవడు

English summary

A Kerala Bishop was came forward to donate his kidney to a Patient who was in serious health condition.