పాపం ... డాన్స్ చేస్తూనే... పోయాడు

Kerala dancer dies on stage during dance performance

11:28 AM ON 7th February, 2017 By Mirchi Vilas

Kerala dancer dies on stage during dance performance

నాటకంలో నటిస్తూ, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ గురించి వింటున్నాం. ఇక డాన్స్ చేస్తూ చేస్తూ ఈలోకం నుంచి నిష్క్రమించాడు ఓ వ్యక్తి. అవును అతనికి నాట్యమంటే పిచ్చి. నాట్యమే అతని జీవితం. నాట్యమే సర్వస్వమనుకుని ఆరాధించాడు. చివరకు వేదికపై నాట్యం చేస్తూనే ప్రాణాలొదిలాడు. వివరాల్లోకి వెళ్తే,

కేరళలోని పరవూర్ లో స్టేజ్ పై ప్రదర్శన ఇస్తున్నాడు 48ఏళ్ల ఒమనాకుట్టన్ 25ఏళ్లుగా దాదాపు 400 స్టేజ్ షోలు చేసాడు. అయితే ఒమనాకుట్టన్ స్టేజ్ మీద మరో డ్యాన్సర్ తో కలిసి నాట్యం చేస్తూ ఉన్న ఫళంగా కుప్పకూలిపోయాడు. ఆడియన్స్ అంతామొదట నాట్యంలో ఇదో భాగమనుకున్నారు. అయితే, తోటి డ్యాన్సర్ తేరుకుని నాట్యం చేస్తూనే తెరను కిందకు దింపించి సాయంకోసం అరవడంతో అందరికీ విషయం అర్ధమైంది.

హుటాహుటీనా ఒమనాకుట్టన్ని ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే ఆయన ప్రాణాలొదిలాడ ని వైద్యులు ధ్రువీకరించారు. ప్రదర్శనకు ముందు ఒమనాకుట్టన్ పూర్తి ఆరోగ్యంగానే కనిపించారని ఉన్నట్టుండి ఎందుకిలా అయిందోనని తోటి డ్యాన్సర్లు కన్నీటిపర్యంతమయ్యారు. పలువురు సంతాపం తెలిపారు.

ఇది కూడా చూడండి: మీ ఒంట్లో అదనపు కొవ్వు వారం రోజుల్లో కరిగించే అద్భుత సూప్

ఇది కూడా చూడండి: కాఫీలో ఇది కలుపుకొని తాగితే, బరువు తగ్గుతారట

English summary

Kerala dancer Omanakuttan died on stage during his dance performance.