సినిమాల్లోకి మాజీ సీఎం

Kerala Ex CM to act in a movie

10:58 AM ON 9th July, 2016 By Mirchi Vilas

Kerala Ex CM to act in a movie

సినిమా వాళ్ళు రాజకీయ రంగ ప్రవేశం చేసినట్లే, రాజకీయ నేతలు కూడా సినీ రంగంలో అడుగిడుతున్న సంఘటనలు కూడా ఎన్నో వున్నాయి. తాజాగా మరో నేత సినీ రంగంలోకి దిగుతున్నారు. ఆయన ఎవరంటే, కేరళ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన సీపీఎం సీనియర్ లీడర్ అచ్యుతానందన్. వాస్తవానికి మొన్నటి ఎన్నికల్లో సిపిఎం పార్టీ గెలిచినా కూడా మళ్లీ రెండోసారి సీఎం అవకాశం అందుకోలేకపోయిన కేరళ మాజీ సీఎం ఇప్పుడు రాజకీయంగా ఖాళీగా ఉండడంతో ఓ మలయాళ మూవీలో నటించడానికి ఓకే చెప్పారట.

సామాజిక సమస్యలపై జీవన్ దాస్ అనే దర్శకుడు తీస్తున్న ఈ మలయాళ సినిమాలో ఆయన నటించనున్నారు. ఈ మేరకు దర్శకుడి కోరికను ఆయన అంగీకరించారట. అనేక పోరాటాల్లో పాల్గొని వేలాది సమావేశాల్లో మాట్లాడిన అచ్యుతానందన్ ఎన్నో సమస్యలపై కూడా పోరాడారు. అందుకే ఆ పాత్రకు ఆయనైతేనే కరెక్టుగా సరిపోతారని అంటున్నారు.ఇక ఈ సినిమాలో అచ్యుతానందన్ ది కీలక పాత్రంట.

కాగా అచ్యుతానందన్ తమ సినిమాలో నటించనుండడం ఎంతో గౌరవంగా భావిస్తున్నామని దర్శకుడు జీవన్ దాస్ చెబుతున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ కొంతవరకు పూర్తయిన ఈ సినిమా సెప్టెంబరులో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారట మొత్తానికి ఈ మాజీ సీఎం సినీ పాత్ర ద్వారా ఏం సంచలనం సృష్టించనున్నారో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి:ఓ ఎస్సై డాన్స్ మత్తులో మునిగాడు - అడ్డంగా బుక్కయ్యాడు

ఇవి కూడా చదవండి:వైఫ్ కి డైవోర్స్ ఇవ్వాలంటూ హీరో పై హీరోయిన్ ఒత్తిడి

English summary

Kerala State Ex Chief Minister and CPI Leader Achuthanandan was going to act in one Kerala Film which was going to direct by director Jeevan Das.