లిక్కర్ కిక్కులేని రాష్ట్రం - మొహం వాచిన మద్యం ప్రియులు

Kerala Government Ban Liquor

11:17 AM ON 26th July, 2016 By Mirchi Vilas

Kerala Government Ban Liquor

ఏదైనా పాలసీ పెట్టాలే గానీ దానికి ప్లస్ మైనస్ లు ఖచ్చితంగా ఉంటాయి. చివరకూ లిక్కర్ పాలసీ అయినా అంతే మరి. సరిగ్గా కేరళలో అదే జరుగుతోంది. కనువిందుగా సాగే ఈవెంట్స్ సందర్భంగానో, కార్పొరేట్ ఫంక్షన్లు, కాన్ఫరెన్సులు జరిగే సందర్భంలోనో కాస్త చుక్కేసుకుని మజా చేద్దామంటే వీల్లేదని కేరళ ప్రభుత్వం అంటోంది. మొత్తం మందు బంద్ చేయాలని ఆర్డర్లు జారీ చేసింది. కొత్త ఆబ్కారీ పాలసీ ప్రకారం..రూల్స్ చాలా పెట్టేసారు. బడా ఈవెంట్లు జరిగినప్పుడు కూడా మందూ లేదూ గిందూ లేదు అంటూ ఎక్సైజు అధికారులు నిబంధనలు గట్టిగానే అమలు చేయడంతో, మందు బాబులే కాదు.. ఈ ఎటాక్ మిగిలిన రంగాలపై పడిందట. మరీ ముఖ్యంగా హాస్పిటాలిటీ కొరవడి, టూరిజం కూడా దెబ్బతిందట.

మామూలుగా అయితే, చోట్ల ఫైవ్ స్టార్ హోటళ్ళలో పెళ్ళిళ్ళు ఇతర శుభ కార్యాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఇప్పుడు లిక్కర్ పాలసీ కారణంగా ఈ హోటళ్ళ లాన్స్, స్విమ్మింగ్ పూల్స్, రూఫ్ గార్డెన్ లాంటి చోట్ల ఇక గ్లాసుల గలగలలు వినిపించవు. మందు బాటిళ్ళ చప్పుళ్ళ ప్రసక్తే ఉండదు. పక్క రాష్ట్రం పోతే పోలా అని మండుబాబులంతా ఉసూరుమంటున్నారట. ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చిందన్న చందంగా కేరళ ప్రభుత్వ లిక్కర్ పాలసీ ఏకంగా కీలకమైన టూరిజం రంగం మీద పడింది.

ఇది కూడా చూడండి: హాట్ ఫోటోషూట్ తో మతి పోగొట్టిన రెజీనా!

ఇది కూడా చూడండి: దిమ్మతిరిగే రెస్పాన్స్ ఇచ్చిన కబాలి డైరెక్టర్

ఇది కూడా చూడండి: ఈ దేశాలలో మన రూపాయి విలువ చాలా ఎక్కువ

English summary

Kerala Government Ban Liquor.