కేరళ లెఫ్ట్‌ పార్టీలదే...

Kerala Left won in elections

05:08 PM ON 19th May, 2016 By Mirchi Vilas

Kerala Left won in elections

దేశంలో రాజకీయ చైతన్యానికి పేరు పొందిన కేరళలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షకూటమి (ఎల్డీఎఫ్‌) ఘనవిజయం సాధించింది. మొత్తం 140 స్థానాల్లో ఎల్డీఎఫ్‌ 91 సాధించగా అధికార యూడీఎఫ్‌ 46 స్థానాలు సాధించి పరాజయం పొందింది. అసెంబ్లీ చరిత్రలో తొలిసారిగా భాజపా విజయాన్ని సాధించింది. ఇతరులు ఒక స్థానంలో గెలుపొందారు. యో-యో రాజకీయాలు అంటే ఒకరి తర్వాత ఒకరు అధికారాన్ని పొందడం. ఇందులో భాగంగా తాజాగా ఎల్డీఎఫ్‌ గెలుపొందింది. 1977 నుంచి కేరళలో ఒకసారి కాంగ్రెస్‌ సారథ్యంలోని యూడీఎఫ్‌, మరోసారి ఎల్డీఎఫ్‌ అధికారాన్ని అందుకోవడం గమనార్హం.

వూమెన్‌చాందీ నేతృత్వంలోని యూడీఎఫ్‌ ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడింది. బార్‌ లైసెన్స్‌లు, సోలార్‌ కుంభకోణం రాష్ట్రాన్ని కుదిపివేశాయి. బార్‌ లైసెన్స్‌ల కుంభకోణంలో భాగముందని ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి కేఎం మణి తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. చాందీ అనేక ప్రజాకర్షక పథకాలు చేపట్టినా అవినీతి ఆరోపణల పర్వంలో అవి కొట్టుకుపోయాయి. దీంతో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌ ఓటమి పాలైంది.

English summary

Kerala Left won in elections