గ్రేటర్ మేయర్ కేకే కూతురా ....

Keshava Rao Daughter As GHMC TRS Mayor Candidate

05:14 PM ON 9th January, 2016 By Mirchi Vilas

Keshava Rao Daughter As GHMC TRS Mayor Candidate

కాంగ్రెస్ లో కాకలు తీరిన కె కేశవరావు(కేకే) తెలంగాణా ఉద్యమ సమయంలో టిఆర్ఎస్ తీర్ధం పుచ్చుకుని, ఆపార్టీలో కీలక భూమిక వహించి, అధికారం చేపట్టడానికి దోహదపడ్డారు. అందుకే ఆయనకు టిఆర్ఎస్ అధినేత , తెలంగాణా సిఎమ్ కెసిఆర్ ఓ గిఫ్ట్ ఇవ్వాలని చూస్తున్నారట. అదే గ్రేటర్ ఎన్నికల్లో కేకే కూతురికి మేయర్ పీఠం అప్పగించ బోతున్నారట.

గ్రేటర్ హైదరబాద్ డివిజన్లలో రిజర్వేషన్లతో పాటూ,మేయర్ స్థానం బీసీ వర్గానికి రిజర్వయినట్లు తేలడం, ఎన్నికల సస్పెన్స్ వీడి,ముహూర్తం ఖరారై పోవడంతో ఇక అసలైన ఘట్టం మొదలైంది. గ్రేటర్ లో గెలుపు టిఆర్ఎస్ దేనని ధీమాతో అందరూ అంచనాల్లో వున్నారు. విజయం దక్కితే ,ఇక ఆ పార్టీ బీసీ నేతల్లో ఎవరో ఒకరికి మేయర్ పదవి పొందడం ఖాయం. మేయర్ కీలక పదవి కావడంతో ఎవరో ఒకరికి ఇచ్చే సీను ఉండదని చెప్పవచ్చు. అయితే ఇప్పటికే మేయర్ ఎవరన్నది డిసైడైపోయుంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.అందులోభాగంగానే ఒక్రటెండు పేర్లు తెరమీదికొచ్చాయి.తాజాగా ఆ లిస్టులో టీఆర్ఎస్ ముఖ్యనేత ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే.కేశవరావు కూతురు పేరు జోరుగానే వినిపిస్తోంది. అదే కనుక నిజమైతే, కేకే కు కెసిఆర్ ఇచ్చే గిఫ్ట్ ఇదే అవుతుంది.

కేకే అసలు తన కుమారుడిని రాజకీయాల్లోకి తేవాలని అప్పట్లోనే భావించారట. తీరా అప్పట్లో ఆయన ఓ హత్యకేసులో ఇరుక్కోవడంతో పొలిటికల్ ఎంట్రీ కుదరలేదు.దీంతో ఇప్పుడు దూకుడు పెంచి,కూతురిని రంగంలోకి దించే యత్నంలో భాగంగా, కుమార్తె విజయలక్ష్మీకి కొన్నాళ్ల క్రితమే టీఆర్ఎస్ తీర్ధం ఇప్పించారు.

ప్రస్తుతం విజయలక్ష్మిని గ్రేటర్ బరిలో కార్పొరేటర్ గా నిలబెట్టడానికి కూడా రంగం సిద్ధమయిపోయింది. ఇది గులాబి పార్టీ శ్రేణులకు ఆశ్చర్యం కలిగిస్తోంది.కేకే కూతురు కార్పొరేటర్ గా పోటీ చేయడం వెనుక పెద్ద వ్యూహామే ఉందని అంటున్నారు.టీఆర్ఎస్ కు సొంతంగా మెజార్టీ లభిస్తే తన కూతురిని మేయర్ చేయాలని కేశవరావు ఇప్పటికే కేసీఆర్ దగ్గర హామీ పొందారట.కాంగ్రెస్ నుంచి వచ్చిన కేకేను అడ్డుపెట్టుకుని,గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఝలక్ ఇస్తే,వర్క్ అవుట్ అవుతుందన్న యోచనలో గులాబి బాస్ ఈ మేరకు కేకే విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించినట్లు ఓ వాదన వినిపిస్తోంది.అసలు కార్పొరేటర్ గా టికెట్ తెచ్చుకుని,నెగ్గాక కదా మేయర్ గురించి ఆలోచించేది, అయినా ఇల్లు అలకగానే పండగ కాదు కదా అంటూ గులాబి దళంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

English summary

Ex-Congress Leader who joined in TRS party during Telangana State Movement.Now his daugher to be selec as GHMC Mayor Candidate from TRS party