అవును ఇది సినిమా కాదు..

Kev Kabaddi League In Hyderabad

11:20 AM ON 10th June, 2016 By Mirchi Vilas

Kev Kabaddi League In Hyderabad

ఆ మధ్య కబడ్డీ సినిమా వచ్చింది కదా. అయితే ఇప్పుడు కెవ్వు కేక పెట్టించడానికి నిజంగానే కబడ్డీ ఆడబోతున్నారు. తెలుగు సినీ, టీవీ తారలంతా కబడ్డీ పోటీలతో వావ్ అనిపించనున్నారు. సినిమాలతో బాటు టీవీ సీరియల్స్ లోనూ హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా నటిస్తున్న సుమారు 35 మంది కెవ్ కబడ్డీ పోటీల్లో పాల్గొననున్నారు. జులై రెండో వారంలో ఈ పోటీలు హైదరాబాద్ లో జరుగుతాయని వీటిని నిర్వహిస్తున్న శతాబ్ది టౌన్ షిప్ అధినేత శ్రీనివాస రెడ్డి చెప్పారు.

ఈ నటీమణులు నాలుగు టీమ్ లుగా ఏర్పడి పోటీ పడతారట. వీటికి కెప్టెన్లుగా నవీన, శ్రీవాణి, అంజూ అస్రాని, మంజు వ్యవహరిస్తారు. గురువారం ఫిలిం ఛాంబర్ లో కెవ్ కబడ్డీ లోగో ఆవిష్కరించారు. టీవీ సీరియల్స్ డైరెక్టర్ విక్రం ఆదిత్య వినూత్న ఐడియా ఇదని, సినీ, టీవీ యాక్టర్ల తో ఇలాంటి కబడ్డీ పోటీలు గతంలో ఎప్పుడూ జరగలేదని అంటున్నారు.

ఇవి కూడా చదవండి: వెంకటేశ్వర స్వామితో 13 ఏళ్ల చిన్నారికి పెళ్లి(వీడియో)

ఇవి కూడా చదవండి:బన్నీ సరసన భార్యే హీరోయిన్...

English summary

A Kabaddi League was going to start in Hyderabad and in this Kabaddi league tv actress were divided into four teams and they used to play Kabaddi. This league was conductiing in Hydreabad.