అదో వెర్రి ఎయిర్ లైన్స్: పీటర్సన్

Kevin Peterson Fires On Quantas Airlines

05:17 PM ON 15th December, 2015 By Mirchi Vilas

Kevin Peterson Fires On Quantas Airlines

ఆస్ట్రేలియా ఎయిర్ పోర్టులో ఇంగ్లండ్ మాజీ స్టార్ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ కు చేదు అనుభవం ఎదురైంది. బిగ్ బాష్ లీగ్ లో పాల్గొనేందుకు ఆస్ట్రేలియాకు వచ్చిన పీటర్సన్ కు సిడ్నీ ఎయిర్ పోర్టులో వింత పరిస్థితి ఇబ్బంది పెట్టింది. పీటర్సన్ చెప్పులు వేసుకున్నాడనే కారణంతో క్వాంటాస్ ఎయిర్ లైన్ విశ్రాంతి గదిలోకి అతనిని అనుమతించలేదు. అతను ప్లాస్టిక్ తో చేసిన చెప్పులు వేసుకోవడంతో విశ్రాంతి గదిలోకి రానివ్వలేదు. తనకు ఎయిర్ పోర్టులో చేదు అనుభవం ఎదురు కావడంపై పీటర్సన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంతకుముందు ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఇక్కడ తాను చూడలేదని క్వాంటాస్ ఎయిర్ సర్వీస్ పై మండిపడ్డాడు కేపీ. క్వాంటాస్ ఓ వెర్రి ఎయిర్ వేస్ గా పోలుస్తూ ట్వీట్ చేశాడు. దీనిపై క్వాంటాస్ ఎయిర్ వేస్ దిగివచ్చి పీటర్సన్ కు క్షమాపణలు చెప్పింది. డ్రెస్ కోడ్ నిబంధనలను కఠినతరం చేసిన కారణంగానే పీటర్సన్ పట్ల తమ సిబ్బంది అలా ప్రవర్తించి ఉంటారని సర్దుచెప్పే యత్నం చేసింది.

English summary

England star cricketer Kevin Pietersen has lashed out at Qantas after he was refused entry into the airline's first class lounge for wearing cheppals