కేపీకి కూతురు పుట్టిందోచ్..

Kevin Pietersen have become Dad for a second time

04:04 PM ON 29th December, 2015 By Mirchi Vilas

Kevin Pietersen have become Dad for a second time

ఇంగ్లాండ్‌ స్టార్ క్రికెటర్‌ కెవిన్‌ పీటర్సన్‌ రెండోసారి తండ్రి అయ్యాడు. పీటర్సన్‌ భార్య, సింగర్‌ జెస్సికా టైలర్‌ ఈ నెల 27న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని జెస్సికా టైలర్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది. పీటర్సన్‌ దంపతులకు మొదటి సంతానంగా కొడుకు పుట్టిన విషయం తెలిసిందే. నా ముద్దుల కూతురికి స్వాగతం అంటూ కెవిప్‌ పీటర్సన్‌ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. తన అరచేతుల్లో కూతురు కాళ్లను పట్టుకుని ఫొటో దిగి దాన్ని పోస్ట్ చేశాడు. ఆ చిత్రం సోషల్‌ మీడియాలో ఎంతగానో ఆకట్టుకుంటోంది.

English summary